Flight Collided: ఢిల్లీలో తప్పిన పెను ప్రమాదం.. టేకాఫ్‌కు ముందే విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్ విమానం
స్పైస్‌జెట్ విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌కు వెళ్లే క్రమంలో విమానం అక్కడి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది.
Spicejet Flight Collided: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్పైస్‌జెట్ విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్(Delhi Airport)లో టేకాఫ్‌కు వెళ్లే క్రమంలో విమానం అక్కడి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం స్వల్పంగా ధ్వంసమైంది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్పైస్‌జెట్ బోయింగ్ 737(Spicejet Boieng) 800 విమానం ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత ప్యాసింజర్ టెర్మినల్ నుండి రన్‌వేకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్మూకి వెళ్లేందుకు సిద్ధమైన ఈ విమానం ప్రమాదానికి గురికావడంతో దాని కుడి రెక్క స్పల్పంగా ధ్వంసమైంది. దీంతో ఐలెరాన్ దెబ్బతింది. ఆ స్తంభం కూడా విరిగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే, హుటాహుటీన స్పందించిన అధికారులు.. ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తరలించినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం రెక్కల్లో కొంత భాగాన్ని వెనక్కి నెట్టుతుండగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీనిపై స్పైస్‌జెట్ విచారణకు ఆదేశించింది. స్పైస్‌జెట్ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ రోజు స్పైస్‌జెట్ ఫ్లైట్ SG 160 ఢిల్లీ మరియు జమ్మూ మధ్య పనిచేయాల్సి ఉంది. పుష్ బ్యాక్ సమయంలో, కుడి వింగ్ వెనుక అంచు ఒక పోల్‌తో దగ్గరి సంబంధంలోకి వచ్చింది. ఇది ఐలెరాన్‌లకు నష్టం కలిగించింది. విమానాన్ని నడిపేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. అయితే విమానం కుడి రెక్క పూర్తిగా దెబ్బతిన్నది. ఉదయం 9.20 గంటలకు విమానం ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉందని అధికారులు తెలిపారు.
A SpiceJet flight (passengers) collided with an electric pole at the Delhi airport during pushback of the aircraft. The aircraft was changed for the passengers on board; investigations have been launched: Airport official
— ANI (@ANI) March 28, 2022
Read Also…. Ananthapur: అనంత జిల్లా మొత్తం మాదే అంటున్న జేసీ బ్రదర్స్.. మరీ వారి దూకుడుకు టీడీపీ అధినేత వైఖరేంటి..?