AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓన్లీ రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు.. కౌంట్ చేయలేక కళ్ళు తేలేసిన షోరూం స్టాఫ్!

చాలామందికి చిల్లర చూస్తే చాలా చిరాకు.. కానీ ఆ యువకుడు మూడేళ్ల పాటు చిల్లరను పోగేశాడు. అన్నీ ఒక్క రూపాయి కాయిన్లే. ఆ తర్వాత ఏం చేశాడంటే...?

Viral: ఓన్లీ రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు..  కౌంట్ చేయలేక కళ్ళు తేలేసిన షోరూం స్టాఫ్!
Young man buys a bike with one rupee coins
Ram Naramaneni
|

Updated on: Mar 28, 2022 | 3:34 PM

Share

Trending: చాలామందికి చిల్లర చూస్తే చాలా చిరాకు.. కానీ ఆ యువకుడు మూడేళ్ల పాటు చిల్లరను పోగేశాడు. అన్నీ ఒక్క రూపాయి కాయిన్లే. రెండు లక్షల 60 వేల ఒక్క రూపాయి నాణాలను పోగేసి ఆ యువకుడు కాస్ట్‌లీ బైక్‌ కొన్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన తమిళనాడు(Tamil Nadu)లోని సేలంలో జరిగింది. మూడేళ్ల పాటు రూపాయి నాణాలను జమ చేసి తన కలను నెరవేర్చుకున్నాడు భూబతి అనే యువకుడు. చిల్లరతో నేరుగా బైక్ షోరూం వద్దకు చేరుకుని తనకు నచ్చిన కొత్త బజాజ్ డామినార్ బైక్ (New Bajaj Dominar) కొనుగోలు చేశాడు. ఆయన తీసుకొచ్చిన చిల్లరను లెక్కపెట్టడానికి  పది గంటల సమయం పట్టింది షోరూమ్‌ సిబ్బందికి. బూబతి బిసిఎ గ్రాడ్యుయేట్, నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించే ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. అప్పట్లో బైక్ ఖరీదు రూ.2 లక్షలు ఉంది. ఇప్పుడు 2 లక్షల 60 వేలు అయ్యింది. ఎలాగైనా తన డ్రీమ్ బైక్ కొనాలని డిసైడ్ అయ్యాడు. మూడేళ్ల క్రితం నుంచే ఒక రూపాయి నాణేలను సేకరించి తన పిగ్గీ బ్యాంకులో వేస్తూ వచ్చాడు. అలా సరిపడినంత డబ్బు పోగయ్యాక ఆ చిల్లర నాణేలతో బైక్ షోరూంకు వెళ్లి నచ్చిన బైక్ కొని తెచ్చుకున్నాడు.

Also Read: పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే.. ఇక మీకు తిరుగుండదు పండు