Child sold: తల్లికి తెలియకుండా పురిటిబిడ్డను అమ్మిన కుటుంబం.. విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..!
తల్లి పొత్తిళ్లలోని చంటిబిడ్డను అమ్మేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులో లేక వేరే కారణమో తెలియదు కానీ... తన బిడ్డ తనకు కావాలని ఆ తల్లి రోదిస్తోంది.
Father Sold Child: తల్లి పొత్తిళ్లలోని చంటిబిడ్డను అమ్మేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District)లో కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులో లేక వేరే కారణమో తెలియదు కానీ… తన బిడ్డ తనకు కావాలని ఆ తల్లి రోదిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బిడ్డను తల్లి చెంతకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ పసిబిడ్డ విక్రయ ఘటన జరిగింది తెలంగాణలోని అశ్వరావుపేటలో.. బాధితులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలానికి చెందిన వారు. అల్లిపల్లి గ్రామానికి చెందిన గంటా అరుణ్ కుమార్, చిలకమ్మ దంపతులకు ఈనెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగ బిడ్డ పుట్టాడు. అయితే ఆ బిడ్డ ను ఈ నెల 7న ఓ ఆర్ఎంపీ డాక్టర్ సహాయంతో బిడ్డ తండ్రి అరుణ్ కుమార్, అతని తల్లి మేరీ విశాఖకు చెందిన వారికి రూ.2 లక్షలకు ఆ బిడ్డను విక్రయించారు.
అరుణ్ కుమార్ తల్లి మేరీ అల్లిపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలతో మా కోడలు చిలకమ్మకు గుడ్లు, పాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసింది. అయితే బిడ్డ ఎక్కడ అని అధికారులు మేరీని నిలదీయడంతో ఒకసారి చనిపోయిందని, మరొకసారి బతికే ఉందని పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారులు అనుమానంతో విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో బిడ్డను రెండు లక్షలకు అమ్మినట్టు తేలింది. దీంతో అంగన్వాడి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే చిలకమ్మ తన బిడ్డ తనకు అప్పగించాలని విలపిస్తుంది. భర్త అరుణ్ కుమార్ ఆర్ఎంపీ డాక్టర్ బుచ్చి బాబుని తమ బిడ్డ ఎక్కడున్నాడో చెప్పమని అడిగిన చెప్పడం లేదని, బిడ్డను చూస్తే ప్రేమలు పెరుగుతాయని చెబుతూ తమని బెదిరిస్తున్నాడని, ఈ విషయం ఇప్పటికే అంగన్వాడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని చెబుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే అశ్వారావు పేట పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి బిడ్డ ఆచూకీ తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ బిడ్డను తల్లి ఒడికి చేర్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Read Also…. Watch Video: చెన్నై టీంలో చేరిన ఆల్ రౌండర్.. ఘన స్వాగతం పలికిన ప్లేయర్స్.. ఇక దబిడ దిబిడే అంటోన్న ఫ్యాన్స్..