AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పరిగిలో బాలిక అత్యాచార, హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. పక్కా స్కెచ్

వికారాబాద్ జిల్లా బాలిక హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అదేమీ ఆవేశంలో చేసిన పని కాదు.. పక్కా స్కెచ్. పరిచయాన్ని ఎరగా వేసి.. బాలికను చెరబట్టేందుకు కీచకులు ప్రయత్నించారు. చివరికి ప్లాన్ బెడిసికొట్టడంతో ఏకంగా ప్రాణాలే తీశారు కర్కశులు.

Telangana: పరిగిలో బాలిక అత్యాచార, హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..  పక్కా స్కెచ్
Parigi Girl Murder
Ram Naramaneni
|

Updated on: Mar 28, 2022 | 9:04 PM

Share

పరిగిలో బాలిక అత్యాచార, హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలికపై అఘాయిత్యానికి ముందు రోజే ప్లాన్ జరిగింది. మహేందర్‌తో పాటు అతని స్నేహితులు సుఖేందర్, అశోక్ ఈ హత్యలో ప్రమేయం ఉంది. ఈ కేసులో A1గా మహేందర్‌, A2 అశోక్‌, A3గా సుఖేందర్‌ ఉన్నారు. ముందురోజు రాత్రి మహేందర్ పొలంలోనే ముగ్గురు స్నేహితులు మందు పార్టీ చేసుకున్నారు. ఆటైమ్‌లోనే అటాక్‌కు స్కెచ్ వేశారు. బాలికతో మహేందర్‌కు ముందు నుంచే పరిచయం ఉండడంతో.. ఉదయాన్నే తనను కలవాలని బాలికకు మెసేజ్ పెట్టాడు. దాని ప్రకారమే చెప్పిన టైమ్‌కు.. మహేందర్‌ను కలిసేందుకు బాలిక వెళ్లింది. అప్పటికే స్పాట్‌లో ఉన్న ముగ్గురు స్నేహితులు.. బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో తలపై రాడ్‌తో మోది హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్లిపోయారు నిందితులు. తమ కూతురిని పొట్టనబెట్టుకున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి వేడుకుంటోంది. తన కూతురు అనుభవించిన క్షోభ వాళ్లూ అనుభవించేలా చేయాలని డిమాండ్ చేస్తోంది.

మరోవైపు తన కొడుకు నాని అలియాస్‌.. మహేందర్‌ తప్పు చేయడని అతని తండ్రి లక్ష్మయ్య చెప్పారు. ఇలాంటి తప్పు చేస్తే ఎవరూ చేసినా సరే.. చివరకు తన కొడుకైనా ఉరి తీయాల్సిందే అంటున్నారు.  దిశ ఘటనతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయ్‌. రేపిస్టులను ఉరితీయడంటూ జనం నినదిస్తోంది.. అయినా మృగాళ్లలో మార్పు మాత్రం రావడంలేదు.. మహిళలపై లైంగిక హత్యాచారాల పరంపర ఆగడం లేదు.

Also Read: Tollywood: ఇన్​స్టాలో ఒక్క పోస్ట్‌కు సమంత ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ తినాల్సిందే..!