Hyderabad: అతి చేస్తే తాట తీస్తామన్న పోలీసులు.. మందుబాబుల ముందుచూపు.. ఎంతమంది గోవా చెక్కేశారో తెలుసా..?

డిసెంబర్ 31న ఉన్న ఏడాదికి ముగింపు పలికి.. కొత్త ఏడాదిని ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం కరోనా సీజన్ నడుస్తోంది.

Hyderabad: అతి చేస్తే తాట తీస్తామన్న పోలీసులు.. మందుబాబుల ముందుచూపు.. ఎంతమంది గోవా చెక్కేశారో తెలుసా..?
New Year 2022
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 31, 2021 | 1:27 PM

డిసెంబర్ 31న ఉన్న ఏడాదికి ముగింపు పలికి.. కొత్త ఏడాదిని ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం కరోనా సీజన్ నడుస్తోంది. అందునా ఒమిక్రాన్ వేరియండ్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో కొత్త సంవత్సరం వేడుకలపై తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో అతి చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే.. జైలు తప్పదని వార్నింగ్ ఇచ్చారు.  ఫ్లైఓవర్లపై రాకపోకలు బంద్ చేశారు.  పబ్‌లు, బార్లలో కూడా డీజేలకు పర్మిషన్ ఇవ్వలేం అని స్పష్టం చేశారు. మైనర్లకు కూడా పబ్స్‌లోకి అనుమతి లేదు. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన పలువురు మద్యం ప్రియులు, నగరవాసులు గోవా చెక్కేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఫ్లైట్స్ ద్వారా నాలుగు వేల మంది గోవా వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. గురువారం 1782, శుక్రవారం 2365 మంది ఫ్లైట్ లో గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. రోడ్డు మార్గం ద్వారా మరో పది వేల మంది గోవా వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. కోర్టు, ప్రభుత్వం, పోలీసులు.. కఠిన ఆంక్షలు విధించడంతో.. హైదరాబాద్‌లో ఉండకుండా గోవా చెక్కేశారు చాలామంది పార్టీ ప్రియులు. ఇక డ్రగ్స్‌పై కూడా హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ బ్యాచ్ కూడా ఇక్కడ లాభం లేదని.. గోవా జారుకుంది. వీరి పార్టీ జోష్‌కు అనుగుణంగానే గోవాలోని పలు పబ్‌లు, రిసార్టులు స్పెషల్ ఆఫర్లలో ఆకట్టుకున్నాయి. గోవాలో ఇప్పటికే హోటల్స్‌ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశాయి. 90 శాతం హోటల్స్ బుక్కయ్యాయి. నార్మల్ డేస్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ రేట్లు పెట్టినా బుకింగ్స్ అయిపోయాయి. ఇక విల్లాలు, రిసార్ట్‌లు ఇప్పటికే పర్యాటకులతో నిండిపోయాయి.

అయితే 2022 వచ్చినా కూడా డేట్ తప్ప.. లైఫ్ లో పెద్దగా ఏ ఛేంజ్ ఉండదు. కాబట్టి పార్టీలకు వెళ్లినవారు ఇంటి వద్ద మీ కోసం కుటుంబాలు ఉన్నాయని గుర్తుంచుకుని జాగ్రత్తగా మెలగండి.

Also Read: కొత్తగా వాహనాలు కొన్నవారికి ఊరటనిచ్చే న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?