AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhi Hospital: మరో ఘనత సాధించిన గాంధీ దవాఖాన.. దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక ఆస్పత్రిగా..

Gandhi Hospital: తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ దావఖాన అయిన గాంధీ ఆస్పత్రి మరో ఘనత సాధించింది. ఐసీఎంఆర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ అభివృద్ధి..

Gandhi Hospital: మరో ఘనత సాధించిన గాంధీ దవాఖాన.. దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక ఆస్పత్రిగా..
Shiva Prajapati
|

Updated on: Dec 30, 2021 | 11:25 PM

Share

Gandhi Hospital: తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ దావఖాన అయిన గాంధీ ఆస్పత్రి మరో ఘనత సాధించింది. ఐసీఎంఆర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ అభివృద్ధి చేస్తున్న ‘ఇండియన్‌ క్లినికల్‌ ట్రయల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ నెట్‌వర్క్‌’ (ఐఎన్‌టీఈఎన్‌టీ-ఇంటెంట్‌)కు గాంధీ హాస్పటిల్ ఎంపికైంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ‘రీజినల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ యూనిట్‌’గా ఎంపికై రికార్డు సాధించింది. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం పాలసీలు, కార్యక్రమాల రూపకల్పనకు కావాల్సిన ఆధారాలను క్లినికల్‌ ట్రయల్స్‌, ఇతర పరిశోధనల ద్వారా తయారు చేసేందుకు ఐసీఎంఆర్‌, డీహెచ్‌ఆర్‌ సంయుక్తంగా ‘ఇంటెంట్‌’ పేరుతో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఇందులో భాగస్వామి కావాలంటూ ఐసీఎంఆర్‌ ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా, ‘మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్‌’ (ఎండీఆర్‌యూ) ఉన్న మెడికల్‌ కాలేజీలు మాత్రమే క్లినికల్‌ ట్రయల్‌ యూనిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. అన్ని అర్హతలను పరిశీలించిన అనంతరం గాంధీ ఆస్పత్రిని దక్షిణాదికి ‘రీజినల్‌ క్లినికల్‌ ట్రయల్‌ యూనిట్‌’ (ఆర్‌సీటీయూ)గా ఎంపిక చేసింది. దీంతో ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే క్లినికల్‌ ట్రయల్స్‌ గాంధీ హాస్పిటల్‌లో జరుగనున్నాయి.

ఇకపోతే గాంధీలో అత్యాధునిక ఎండీఆర్‌యూ ఉన్నది. రూ.5 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. మరికొన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బయోకెమిస్ట్రీ, పాథాలజీ, జెనెటిక్స్‌ వంటి పరిశోధనలకు ఈ యూనిట్‌లో పరికరాలున్నాయి. దీనికి డాక్టర్‌ కే నాగమణి నోడల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇందులో ఇద్దరు డిప్యూటీ నోడల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ త్రిలోక్‌ చందర్‌, పద్మ సునేత్రి, ఇద్దరు సైంటిస్టులు మాధవీ లత, విన్నీ థామస్‌ పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 27 ఫ్యాకల్టీ రీసెర్చ్‌ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. దాదాపు 17 పూర్తికాగా, మరో 10 తుది దశకు చేరాయి. ఈ వివరాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఐసీఎంఆర్‌ గాంధీ దవాఖానను రీజినల్‌ సెంటర్‌గా ఎంపిక చేసింది.

Also read:

Vastu Tips: కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే, వీటిని మీ ఇంట్లోంచి పడేయండి..!

Telangana Politics: సిట్టింగ్ సీటుకు ఎస‌రు పెట్టే ప్రయ‌త్నం.. ఎవరి సీటుకు ముప్పు పొంచిఉందంటే..!

Big News Big Debate: గుంటూరు జిన్నా టవర్‌ పే రచ్చ.. కాషాయం లేటెస్ట్‌ ఈక్వేషన్‌.. ముస్లిం లీగ్‌ నుంచి రియాక్షన్‌..