Hyderabad: పటాన్‌చెరులో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru) మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం(Fire accident) జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ రసాయన కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో...

Hyderabad: పటాన్‌చెరులో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ
Patancheru Fire Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 30, 2022 | 7:06 PM

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru) మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం(Fire accident) జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ రసాయన కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో పారిశ్రామికవాడలోని కార్మికులందరూ భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ముందుగా పెయింట్‌ పరిశ్రమలో మంటలు వచ్చాయి. వాటిని అదుపులోకి తీసుకురాలేకపోవడంతో పక్కనే ఉన్న రసాయన పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పరిశ్రమలోని కెమికల్ డ్రమ్ములు పేలి, ఎగిరిపడుతున్నాయి. భారీగా పొగ అలుముకోవడంతో ఏం జరుగుందోనన్న భయంతో అక్కడున్న వారందరూ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పటాన్ చెరు, సంగారెడ్డి, బీడీఎల్ నుంచి ఆరు ఫైరింజన్లను తెప్పించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యాజమాన్యం వెల్లడించింది. పటాన్‌చెరు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింద‌నే విషయంపై వివ‌రాలు సేకరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Viral Video: నడిబజారులో చేతిపంపు వద్ద స్నానం చేసిన రాష్ట్ర మంత్రి.. అంత కష్టం ఎమొచ్చిందబ్బా!

Sonusood: సోనూసూద్ క్రేజ్ ఇదే.. ఆచార్య థియేటర్ల ముందు రియల్ హీరో భారీ కటౌట్.. పాలాభిషేకం..

Taj Mahal Controversy: కొత్త వివాదంలో తాజ్ మహల్.. మరోసారి తెరపైకి తేజో మహాలయ శివుడి ప్రతిష్ట!