Sonusood: సోనూసూద్ క్రేజ్ ఇదే.. ఆచార్య థియేటర్ల ముందు రియల్ హీరో భారీ కటౌట్.. పాలాభిషేకం..
ఏప్రిల్ 29న విడుదలైన ఆచార్య సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ
ఏప్రిల్ 29న విడుదలైన ఆచార్య (Acharya) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో చరణ్ సరసన పూజా హెగ్డే నటించగా.. ప్రతి నాయకుడి పాత్రలో సోనూసూద్ నటించాడు.. అయితే ఎప్పుడూ సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద హీరో డైరెక్టర్స్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి హడావిడి చేస్తుంటారు అభిమానులు.. కానీ ఈసారి ఆచార్య సినిమా విషయంలో మాత్రం హీరోలతోపాటు.. విలన్ పాత్రలో నటించిన సోనూసూద్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి పాలభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోనూసూద్ తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేస్తూ.. నేను దీనికి అర్హుడను కాదు.. మీ పట్ల ఇంకా చెప్పలేనంత వినయంగా మాత్రం ఉన్నాను.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.
కరోనా.. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల పట్ల అపద్భాందవుడిగా మారాడు సోనూసూద్.. తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి వలస కార్మికులకు రైళ్లు.. విమానాలు ఏర్పాటు చేసి సాయం అందించాడు. అంతేకాకుండా.. అడిగిన వారికి లేదనకుండా తనవంతూ సాయం చేసి రియల్ హీరోగా మారాడు. సోనూ చేసిన సేవలు పొందినవారు అతడిని దైవంగా భావించి కొనియాడారు. తమ షాపులకు.. పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ సోనూ సూద్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాంతంతో సంబంధం లేకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న గ్రామాల్లో సైతం అడిగినవారికి తనవంతూ సాయం చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత సోనూసూద్ ఆచార్య సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఇందులో ఈ రియాల్ హీరో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. దీంతో సోనూసూద్ అభిమానులు ఆచార్య థియేటర్ల వద్ధ ఆయన భారీ కటౌట్ ఏర్పాటు చేసి పాలభిషేకం చేశారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియోను సోనూసూద్ షేర్ చేశాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..
KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..
Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా.
Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్గా..