Hyderabad Rains: భాగ్యనగరంలో దంచి కొట్టిన వాన.. రోడ్లన్నీ జలమయం.. జనజీవనం అస్తవ్యస్తం
భాగ్యనగరంలో భారీ వర్షాలతో చాలాచోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి తమ ఇండ్లకు చేరుకుంటున్న ఉద్యోగులు, కూలీలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం దంచికొట్టింది . ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు . షేక్ పేట్ లో అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా, శేరి లింగంపల్లి లో మాదాపూర్ కాకతీయ హిల్స్ 12.75సెంటి మీటర్లు, మాదాపూర్ వద్ద 12.18 సెంటీమీటర్ల , జూబ్లీహిల్స్ 11.38, హైదర్ నగర్ లో 11.5 సెంటీమీటర్ల,కాజాగూడ లో 9.7, రాయదుర్గ 9.3, మియాపూర్ 8.1 సెంటీమీటర్ల వర్షం నమోదు ఐయింది. చాలాచోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి తమ ఇండ్లకు చేరుకుంటున్న ఉద్యోగులు, కూలీలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
మరోవైపు నిజాంపేట్ ఏరియాలో కురిసిన భారీ వర్షానికి ఇండ్లల్లోకి వరద నీరు చేరింది. బండారి లే అవుట్ , రాజధాని స్కూల్ నుంచి వర్షపు నీరు రెడ్డి అవెన్యూ కాలనీ కి చేరడంతో ఇంట్లోని వాళ్లంతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పలు కాలనీల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. నాలా పనులు ఆలస్యంగా జరగడం, వర్షపు నీరు పోయే మార్గాన్ని కుదించడంతో సమస్య ఏర్పడిందని స్థానికులు తెలిపారు.
Reporter: Anil , Tv9 Telugu




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
