Hyderabad: ఇలా అయితే దొరకరని బంగారం అక్కడ పెట్టుకుని తెచ్చారు.. వారిచ్చిన షాక్‌కు మైండ్ బ్లాంక్..
శంషాబాద్ ఎయిర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్, కువైట్ నుంచి వస్తున్న పలువురు ప్రయాణికుల..

శంషాబాద్ ఎయిర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్, కువైట్ నుంచి వస్తున్న పలువురు ప్రయాణికుల వద్ద నుంచి భారీగా బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు.ఓ మహిళా ప్రయాణికురాలు పేస్ట్ రూపంలో బంగారం తీసుకురాగా గుర్తించిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెక్ చేయగా.. పేస్ట్ రూపంలో ఉన్న బంగారం బయటపడింది. వెంటనే ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం 234.2 గ్రాములు ఉంటుందని అధికారులు ప్రకటించారు.
ఇక కువైట్ నుంచి వస్తున్న మరో ఇద్దరు ప్రయాణికుల వద్ద నుండి రెండు 855 గ్రాముల గోల్డ్ బార్స్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. లోదుస్తుల్లో పెట్టుకుంటే ఎవరికీ కనిపించకుండా సేఫ్‌గా ఉండొచ్చని భావించిన వీరు.. లోదుస్తుల్లో బంగారం దాచుకుని తీసుకువచ్చారు. కానీ, తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించారు. లోదుస్తుల్లో బంగారం దాచినట్లు గుర్తించి.. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరో ముగ్గురు మహిళా ప్రయాణికురాళ్ల వద్ద నుంచి 3,283 గ్రాముల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. వీటి విలువ రూ. 1.72 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. మూడు కేసుల్లో మొత్తం నాలుగున్నర కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. మొత్తం ఆరుగురుని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
