హైద‌రాబాద్ న‌గ‌రంలో కుండ‌పోత‌ వ‌ర్షం..

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో గురువారం తెల్ల‌వారుజామున భారీ వ‌ర్షం కురిసింది. ఉరుముల‌తో పాటు బ‌ల‌మైన ఈదురు‌ గాలులు కూడా వీచాయి. రాత్రంతా ఉక్క‌పోత‌కు గురైన సిటీ ప్ర‌జ‌లు.. ఉద‌యం వాన కుర‌వ‌డంతో కాస్త ఉప‌స‌మనం పొందారు. కాగా భారీ వ‌ర్షంతో ప‌లు ప్రాంతాల్లో..

హైద‌రాబాద్ న‌గ‌రంలో కుండ‌పోత‌ వ‌ర్షం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2020 | 5:31 PM

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో గురువారం తెల్ల‌వారుజామున భారీ వ‌ర్షం కురిసింది. ఉరుముల‌తో పాటు బ‌ల‌మైన ఈదురు‌ గాలులు కూడా వీచాయి. రాత్రంతా ఉక్క‌పోత‌కు గురైన సిటీ ప్ర‌జ‌లు.. ఉద‌యం వాన కుర‌వ‌డంతో కాస్త ఉప‌స‌మనం పొందారు. కాగా భారీ వ‌ర్షంతో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షపు నీరు నిలిచిపోయింది. అలానే కొన్ని చోట్ల విద్యుత్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది. అమీర్ పేట్‌, పంజాగుట్ట‌, బంజారాహిల్స్, జూబ్లీహిట్స్, సోమాజిగూడ‌, అబిడ్స్, దిల్‌సుఖ్ న‌గ‌ర్, కోఠి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీన‌గ‌ర్‌, తార్నాక‌, ఉప్ప‌ల్‌, సికింద్రాబాద్‌, బోయిన్ ప‌ల్లి, తిరుమ‌ల‌గిరి, మారేడ్ ప‌ల్లి, బేగంపేట‌, ఖైర‌తాబాద్, కూక‌ట్ ప‌ల్లి, మియాపూర్‌ల‌లో భారీ వ‌ర్షం కురిసింది. కాగా గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసింది.

Read More: 

11 ఏళ్ల త‌ర్వాత బాలీవుడ్‌కి ‘అరుంధ‌తి’?

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విల‌యం.. విప‌రీతంగా కేసులు న‌మోదు..