తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విల‌యం.. విప‌రీతంగా కేసులు న‌మోదు..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా..

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విల‌యం.. విప‌రీతంగా కేసులు న‌మోదు..
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 6:49 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 6,045 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 64,713కి చేరింది. ఇందులో 31,763 యాక్టివ్ కేసులు ఉండగా.. 32,127 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 823కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 6,494 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 65 మంది మృతి చెందారు.

ఇక బుధ‌వారం కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 325, చిత్తూరు 345, ఈస్ట్ గోదావరి 891, గుంటూరు 842, కడప 229, కృష్ణ 151, కర్నూలు 678, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విశాఖపట్నం 1049, విజయనగరం 107, వెస్ట్ గోదావరిలో 672 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో తూర్పుగోదావరి(8647), కర్నూలు(7797), అనంతపురం(6266) జిల్లాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఎక్కువ కరోనా మరణాలు కర్నూలు(135), కృష్ణా(118) జిల్లాల్లో సంభవించాయి. కాగా, నేటి వరకు 14,35,827 సాంపిల్స్ ని పరీక్షించారు.

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నిత్యం పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం రాష్ట్రంలో 1,554 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 49,259 మందికి కరోనా బారినపడ్డారు. కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ తొమ్మిది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 438కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 842 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇవాళ 1,281 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 37,666 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11,155మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం 15,882 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,93,077 మందికి టెస్టులు చేసినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..