కరోనా టైమ్‌: కొత్తగా వంద ‘108’ అంబులెన్స్‌ల కొనుగోలు

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 108 అత్యవసర అంబులెన్స్‌ సేవలను మరింత విస్తరించబోతోంది.

కరోనా టైమ్‌: కొత్తగా వంద '108' అంబులెన్స్‌ల కొనుగోలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2020 | 9:01 AM

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 108 అత్యవసర అంబులెన్స్‌ సేవలను మరింత విస్తరించబోతోంది. కొత్తగా మరో వంద 108 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. నేడో, రేపో ఈ వాహనాలు రాష్ట్రానికి చేరుకోనున్నాయి. కాగా ప్రస్తుతమున్న వాహనాల్లో 90 అంబులెన్సులు కరోనా బాధితుల కోసం, మిగిలిన వాటిని ఇతర అత్యవసర సేవలకు వినియోగిస్తోంది. ఈ క్రమంలో అంబులెన్స్‌ల‌ కొరత ఏర్పడి.. కొన్నిచోట్ల సాధారణ వాహనాలను వినియోగిస్తున్నారు. వాటిల్లో ఆక్సిజన్‌ సదుపాయాలు కూడా ఉండటంలేదు. ఈ నేపథ్యంలో వంద కొత్త ‘108’అంబులెన్స్‌ వాహనాలను కొనుగోలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

కొత్తగా వచ్చే అంబులెన్స్‌ల్లో ఆక్సిజన్ సదుపాయం ఉండనుంది.  అత్యాధునిక వసతులతో ఈ అంబులెన్స్‌లు తయారు చేయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాలు, ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ అంబులెన్స్‌లకు అవసరమైన డ్రైవర్లు, ఇతర పారామెడికల్‌ సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.