వార్నింగ్‌లు ఇస్తే ఏంటి.? గాజులు తొడుక్కుని కూర్చోలేదు.. వర్మ ఫైర్..
పవర్ స్టార్ కేవలం ఫిక్షన్ సినిమా మాత్రమే. ఎవర్ని ఉద్దేశించి తెరకెక్కించలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీసింది. అలాగే వార్నింగ్‌లు ఇస్తే భయపడడానికి ఇక్కడ ఎవడూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు...
Ram Gopal Varma Warning To Pawan Fans: రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు సంచలనాలకు కేరాఫ్ అయిన ఈ దర్శకుడు.. ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాడు. ఆయన తీసే సినిమాలే విమర్శలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆర్జీవీ ‘పవర్ స్టార్’ అనే టైటిల్‌తో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమ అభిమాన హీరోను టార్గెట్ చేసి సినిమాను తెరకెక్కించారంటూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వర్మ మాత్రం ఈ మూవీ ఎవరిని ఉద్దేశించి తెరకెక్కించలేదని చెబుతున్నాడు. ప్రస్తుతం ఆర్జీవీ, పవన్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక తాజాగా సినిమా గురించి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. ”పవర్ స్టార్ కేవలం ఫిక్షన్ సినిమా మాత్రమే. ఎవర్ని ఉద్దేశించి తెరకెక్కించలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీసింది. అలాగే వార్నింగ్‌లు ఇస్తే భయపడడానికి ఇక్కడ ఎవడూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేను ఒక్కడినే ఉన్నా. నా ఆఫీస్ అందరికీ తెలుసు. గూగుల్ మ్యాప్స్‌లో కూడా దొరుకుతుంది. రమ్మనండి ఎవరినైనా చూద్దాం” అని పేర్కొన్నారు.
Also Read:
సుశాంత్ కెరీర్‌ను నాశనం చేసింది ‘ఆ నలుగురే’… కంగనా కామెంట్స్..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..
Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…