వారందరినీ విధుల్లోకి తీసుకోండి: కలెక్టర్లకు ఆరోగ్య శాఖ విఙ్ఞప్తి

కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిది. ఇక రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో వారి సేవలు మరింత అవసరమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

వారందరినీ విధుల్లోకి తీసుకోండి: కలెక్టర్లకు ఆరోగ్య శాఖ విఙ్ఞప్తి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2020 | 9:08 AM

కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిది. ఇక రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో వారి సేవలు మరింత అవసరమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ డాక్టర్లతో పాటు ప్రైవేటు డాక్టర్లు కూడా కరోనా నియంత్రణ విధుల్లో పాల్గొని సేవలందించాలని కలెక్టర్లకు వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులందరినీ గుర్తించి వారి సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయుష్‌ డాక్టర్లు, ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తున్న ఎంబీబీఎస్‌ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఎన్‌సీసీ వాలంటీర్లు, అసోసియేషన్‌ సభ్యులు, యూత్‌క్లబ్‌లు.. ఇలా అందరినీ భాగస్వామ్యం చేసి, తక్షణమే విధుల్లోకి రప్పించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇక కరోనా‌ సేవల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రక్షణ కిట్‌లు ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించింది.