వర్షాలు, ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాల లేటెస్ట్ అప్డేట్ ఇదే..
ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే సూచనలు ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఎల్‌నినో ప్రభావంతో ఏపీ, తెలంగాణలో హీట్ వేవ్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో తీవ్ర ఎండలు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి.. వాతావరణంలో తీవ్ర మార్పులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.. ఎండలు.. వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అరబిక్ మహాసముద్రం, ఆగ్నేయ అరబిక్ మహాసముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, అలాగే నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న తూర్పు విదర్భపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం (upper air cyclonic circulation) ఇప్పుడు ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరిల గుండా దక్షిణ కేరళ వరకు ఒక ద్రోణి (trough) కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)
సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. తదుపరి రేపు నుండి నాలుగు రోజుల వరకు క్రమంగా రెండు నుండి నాలుగు డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:-
సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ :-
సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గమనిక ;- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో పెద్దగా మార్పు లేకుండా 2-3℃ తగ్గే అవకాశముంది.
