AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: రైతులకు పండగే.. రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. ఇక వర్షాలే వర్షాలు..

తెలంగాణలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఎట్టకేలకు పూర్తిస్థాయికి చేరుకుంది. ఈ నెల 8న జోగులాంబ గద్వాల్ జిల్లా ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, దాదాపు 15 రోజుల ప్రయాణం తర్వాత జూన్ 23న తెలంగాణ మొత్తాన్ని కవర్ చేశాయి. మధ్యలో పలుమార్లు నిలకడగా కదలకుండా కొన్ని జిల్లాల వద్దే ఆగిపోవడంతో రుతుపవనాల విస్తరణ ఆలస్యమైందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Sravan Kumar B
| Edited By: |

Updated on: Jun 23, 2026 | 1:34 PM

Share
వాతావరణ పరిస్థితుల ప్రకారం, జూన్ 8న జోగులాంబ గద్వాల్ జిల్లాలోకి అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు మొదటి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు అదే ప్రాంతంలోనే నిలిచిపోయాయి. అనంతరం జూన్ 12 తర్వాత హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల వరకు విస్తరించినా, అక్కడ కూడా కొంతకాలం స్థిరంగా కొనసాగాయి. ఈ నెమ్మదైన కదలిక కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల పూర్తి విస్తరణ ఆలస్యమైంది. అయితే జూన్ 23 నాటికి తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ నైరుతి రుతుపవనాలు చేరడంతో రాష్ట్రం మొత్తం మాన్సూన్ ప్రభావంలోకి వచ్చింది.

1 / 5
ఇక దేశవ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశాలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. జూన్ 23 నాటికి రుతుపవనాల ఉత్తర సరిహద్దు దహను, వార్ధా, రాయ్‌పూర్, డాల్టన్‌గంజ్, మోతిహారి ప్రాంతాల గుండా విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

2 / 5
వచ్చే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.అలాగే తదుపరి 3 నుంచి 4 రోజుల్లో జార్ఖండ్, బీహార్‌లోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

3 / 5
తెలంగాణ విషయానికి వస్తే, రుతుపవనాల పూర్తి విస్తరణతో రాష్ట్రంలో వర్షపాత పరిస్థితులు మరింత చురుకుగా మారనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని సూచనలు ఉన్నాయి.  ఇప్పటికే రుతుపవనాల పురోగతి వేగం పుంజుకోవడంతో వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. దాంతో రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

4 / 5
మొత్తంగా చూస్తే, ఈసారి తెలంగాణలో నైరుతి రుతుపవనాల పూర్తి విస్తరణకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టినా, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మాన్సూన్ ప్రభావంలోకి రావడంతో వర్షాల యాక్టివిటీ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు, సాధారణ ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలు వర్షాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

5 / 5
Follow Us