AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. థాయ్‌లాండ్‌ నుంచి ఇండియాకు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్.. అతని నుంచి సుమారు రెండు కోట్లకు పైగా విలువైన సుమారు 2.759 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
Delhi Airport Drug Bust
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 6:00 AM

Share

దేశంలో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వినూత్న పద్ధతుల్లో.. ఊహించని రీతిలో అక్రమార్కుల మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాల స్మగ్లింగ్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ పక్క యువతను సన్మార్గంలో పెట్టేందుకు ప్రధాని మోదీ “నషా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్” ప్రచారం ప్రారంభిస్తే.. మరోవైపు ఎయిర్ పోర్టులు, పోర్టులు, అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా ప్రతిరోజు ఎలాగోలా దేశంలో డ్రగ్స్ తీకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు.

తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి అక్రమంగా డ్రగ్స్‌ను తరలిస్తున్న ఓ ప్రయాణికుడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని లగేజ్‌ చెక్‌ చేయగా చాక్లెట్ బాక్సులలో దాచి తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు అధికారులు. అతడి నుంచి సుమారు రెండు కోట్లకు పైగా విలువైన సుమారు 2.759 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫుకెట్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియా (AI 2377) విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ గ్రీన్ ఛానల్ దాటి వెళ్తున్న సమయంలో అతని ప్రవర్తణపై అనుమానం వచ్చిన అధికారులకు అడ్డుకున్నారు. లగేజీని ఎక్స్-రే స్క్రీనింగ్ చేయగా, అందులో 4 వాక్యూమ్-సీల్డ్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. బటయకు కిట్‌క్యాట్ చాక్లెట్ బ్యాక్సుల్లా కనిపించే వాటిని ఓపెన్ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న హైడ్రో ఫోబిక్ గంజాయిని గుర్తించారు.

దీంతో నిందితుడి ఎన్డీపీఎస్ (NDPS) చట్టం-1985లోని సెక్షన్ 43(b) కింద కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ప్రస్తుతం అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..