AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైనికుడి పార్థివదేహంతో వెళ్తున్న అంబులెన్స్‌ ప్రమాదం.. నలుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సైనికుడి పార్థివదేహాన్ని లక్నో నుంచి ఘాజీపూర్‌కు తరలిస్తున్న అంబులెన్స్‌ను ట్రక్కు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. సుల్తాన్‌పూర్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుక సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

సైనికుడి పార్థివదేహంతో వెళ్తున్న అంబులెన్స్‌ ప్రమాదం.. నలుగురు మృతి
UP ambulance accident
Srilakshmi C
|

Updated on: Oct 05, 2026 | 9:05 AM

Share

సుల్తాన్‌పూర్‌, అక్టోబర్‌ 5: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సైనికుడి పార్థివదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సుల్తాన్‌పూర్‌ జిల్లాలోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం (అక్టోబర్‌ 4) ఉదయం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. లక్నో నుంచి ఆర్మీ సుబేదార్‌ సత్యవాన్‌ ఫౌజీ పార్థివదేహాన్ని ఘాజీపూర్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతులను అంబులెన్స్‌ డ్రైవర్‌ జస్పాల్‌, భూపతి కుమారుడు రాజన్‌ సింగ్‌, సత్యభాన్‌ కుమారుడు గౌరవ్‌ సింగ్‌, జయ్‌సింగ్‌ కుమారుడు రామ్‌ సమాజ్‌గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోనే కొద్ది రోజుల క్రితం గోరఖ్‌పూర్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ఘోర ప్రమాదం జరిగింది. అంబేడ్కర్‌ నగర్‌ జిల్లాలో బస్సు, ట్రైలర్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

శుక్రవారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో గోరఖ్‌పూర్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌వే 85వ కిలోమీటర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జైత్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Follow Us