AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా స్టార్స్.. బ్యాటింగ్ యావరేజ్‌లో భారీ జంప్

IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్ తర్వాత భారత బ్యాటర్ల సగటు భారీగా పెరిగింది. కెప్టెన్ శుభమన్ గిల్ తో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ యావరేజ్ గణనీయంగా మెరుగైంది. అయితే ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం ఈ సిరీస్ వల్ల తన బ్యాటింగ్ సగటులో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

IND vs WI: పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా స్టార్స్.. బ్యాటింగ్ యావరేజ్‌లో భారీ జంప్
Team India
Rakesh
|

Updated on: Oct 05, 2026 | 8:38 AM

Share

IND vs WI: ఇటీవల ముగిసిన భారత్, వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో పరుగుల వర్షం కురిసింది. మొదటి మ్యాచ్‌లో విజయంతో పాటు రెండో వన్డేలో ఏకంగా 406 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా అద్భుత చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ ఇతని భారీ టార్గెట్‌‌ను విజయవంతంగా ఛేదించడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్ మొత్తం బ్యాటర్లకు స్వర్గధామంగా మారడంతో భారత ఆటగాళ్ల వ్యక్తిగత బ్యాటింగ్ సగటులు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. కొద్ది మంది మినహా దాదాపు అందరు స్టార్ బ్యాటర్లు తమ యావరేజ్‌ను అద్భుతంగా మెరుగుపరుచుకున్నారు.

టాప్ ప్లేసులో కెప్టెన్ శుభమన్ గిల్

భారత జట్టు యువ కెప్టెన్ శుభమన్ గిల్ ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మూడు మ్యాచ్‌లలో ఏకంగా 334 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో గిల్ బ్యాటింగ్ సగటు 60.33 నుంచి 64.01కి పెరిగింది. అలాగే రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సగటు 58.59 నుంచి 58.78కి చేరింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో తొలిసారిగా 50 సగటు సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. విండీస్ సిరీస్‌కు ముందు 48.95గా ఉన్న రోహిత్ సగటు ఇప్పుడు 49.26కి చేరింది.

దూసుకొచ్చిన కేఎల్ రాహుల్, గైక్వాడ్

చివరి వన్డే మ్యాచ్‌లో అజేయంగా 129 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ తన సగటును గణనీయంగా పెంచుకున్నాడు. రాహుల్ బ్యాటింగ్ సగటు 49.44 నుంచి 51.31కి ఎగబాకింది. శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రుతురాజ్ సగటు 28.50 నుంచి 36.55కి మెరుగైంది. ఈ విధంగా సీనియర్లు, యువ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి తమ గణాంకాలను మరింత పదిలం చేసుకున్నారు.

నితీశ్ కుమార్ రెడ్డికి మాత్రం నిరాశ

అన్ని విభాగాలలోనూ ఆటగాళ్ళు లాభపడినప్పటికీ, యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి మాత్రం ఈ సిరీస్ నిరాశను మిగిల్చింది. ఈ సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డి కేవలం ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేయడానికి అవకాశం దక్కించుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీనివల్ల అతని వ్యక్తిగత బ్యాటింగ్ సగటు 33.33 నుంచి 27.25కి పడిపోయింది. ఈ ఒక్క ఆటగాడు మినహా మిగిలిన అందరూ బ్యాటర్లు ఈ సిరీస్‌తో ఫుల్ బెనిఫిట్ పొందారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us