AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కట్.. ఎందుకంటే?

హైదరాబాద్‌ వాసులకు జలమండలి బోర్డు కీలక సూచనలు జారీ చేసింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు మరమ్మత్తు పనుల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగు నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని.. కాబట్టి ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటిని చూసి వాడుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కట్.. ఎందుకంటే?
Water Supply Interruption Hyderabad
Anand T
|

Updated on: Oct 05, 2026 | 8:55 AM

Share

హైదరాబాద్ వాసులకు బిగ్‌ అలర్ట్.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడబోతుంది. హైదరాబాద్‌ వ్యాప్తంగా తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్–IIలో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2,375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడి, అలాగే స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నివారణ పనులు చేపట్టనున్నారు.

ఈ పనులు ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటల నుంచి తేదీ 06.10.2026 మంగళవారం సాయంత్రం 6 గంటలకు చేపడతారు. కాబట్టి ఈ 36 గంటల పాటు కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగానూ.. మరికొన్ని ప్రాంతాల్లో లో తక్కువ ప్రెజర్‌తో నీటిసరఫరా జరిగే అవకాశం ఉందని జలమండలి బోర్డు స్పష్టం చేసింది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

ఈ మరమ్మత్తుల కారణంగా నగరంలోని ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అలాగే హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్‌లో కూడా నీటి సరఫరా నిలిచిపోతుంది.

అంతేకాదు పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా నలిచే అవకాశం ఉంది. కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జలమండలి కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us