Hyderabad: రాతి సంపదను రక్షించడమే లక్ష్యంగా హైదరాబాద్ ‘రాక్ థాన్ 2022’.. ఫన్‌తో పాటు గొప్ప సందేశం కూడా..
హైదరాబాదీల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు వారంతాల్లో సినిమాలు, పబ్‌లు, టూర్‌లకు ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. కానీ ఇప్పుడు ఇందులో మార్పు వస్తోంది. ప్రజల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. హైదరాబాద్ వాసులు వారాంతాల్లో సైక్లింగ్, రాక్ క్లైంబింగ్ వంటి వాటికి ఆసక్తి..

హైదరాబాదీల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు వారంతాల్లో సినిమాలు, పబ్‌లు, టూర్‌లకు ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. కానీ ఇప్పుడు ఇందులో మార్పు వస్తోంది. ప్రజల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. హైదరాబాద్ వాసులు వారాంతాల్లో సైక్లింగ్, రాక్ క్లైంబింగ్ వంటి వాటికి ఆసక్తి చూపిస్తున్నారు. రాక్ క్లైంబింగ్‌పై నగర వాసుల్లో ఆసక్తి బాగా పెరుగుతోంది. అయితే రియల్ ఎస్టేట్, గ్లోబలైజేషన్ కారణంగా పురాతన రాతి సంపద కరిగిపోతోంది.
కొన్ని చోట్ల గుట్టలను తలపించే రాతిని కొందరు కరిగించేస్తున్నారు. రాతి నిర్మాణాల ప్రాముఖ్యతను సమాజానికి చాటి చెప్పేందుకు గ్రేటర్ హైదరాబాద్ అడ్వేంచర్ క్లబ్, సొసైటీ టు సేవ్ రాక్స్ సయుక్తంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘హైదరాబాద్ రాక్ థాన్ 2022’లో భాగంగా డిసెంబర్ 4న ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకరోజు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా రాతి ప్రాముఖ్యతను తెలియజేయనున్నారు. నర్సింగిలోని DWES సమీపంలో ఉన్న ఘార్ ఈ ముబారక్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. డిసెంబర్ 4వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాపెల్లింగ్, బౌల్డరింగ్, జిప్లింగ్, రాక్ వాక్, రాక్ వాక్, రాక్ షాట్ పుట్, స్లాక్ లినింగ్, స్నేక్ అవార్‌నెస్ వంటి ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనలనుకునే ఔత్సాహికులు Hyderabadrockathon.com లేదా hyderabadrockthon22@gmail.com, 7729988784 నెంబర్లకు సంప్రదించండి. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 03వ తేదీ వరకు టికెట్ బుక్ చేసుకునే వారు రూ. 850 (పెద్దలు), రూ. 750 (చిన్నారులు) చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 4వ తేదీన స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం రూ. 950 (పెద్దలు), రూ. 850 (చిన్నారులు) చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..



