Hyderabad: శంషాబాద్ విమానశ్రయంలో భారీగా పట్టివేత.. ఎవరికీ అనుమానం రాకుండా..
Gold seized in shamshabad airport: బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు కస్టమ్స్ అధికారులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ..
Gold seized in shamshabad airport: బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు కస్టమ్స్ అధికారులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. పలువురు పలు మార్గాల్లో బంగారాన్ని ఇతర దేశాల నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా శంషాబాద్ విమనాశ్రయంలో అక్రమంగా పెద్దమొత్తంలో తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని.. దీని విలువ 1.36 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నవాజ్ పాషా అనే వ్యక్తి క్యాప్సూల్స్, చైన్స్, పేస్ట్ రూపంలో హాండ్ బ్యాగ్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా.. బంగారం బయటపడినట్లు పేర్కొన్నారు. దీని విలువ 1.36 కోట్ల రూపాయలు ఉంటుందని.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
On 21.01.22, Hyderabad Customs has detected and seized 2715.800 gms of gold items valued at Rs.1.36 Crores from a male pax who arrived by 6E 025 from Dubai. Gold chains and gold in paste form were concealed inside hand baggage and check-in baggage. @cbic_india @cgstcushyd pic.twitter.com/aIDzWEkEhW
— Hyderabad Customs (@hydcus) January 22, 2022
అంతకుముందు జనవరి 12న దుబాయ్ నుంచి వచ్చిన మగ్గురు మహిళల నుంచి 1.48 కేజీల బంగారాన్ని స్వాధీనం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. లోదుస్తుల్లో ఉంచి బంగారం తరలిస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు.
Also Read: