AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కొట్టెసిన స్కూటీతో దర్జాగా దొంగతనాలు చేసి చెక్కేశాడు.. మరి పోలీసులు ఏం చేస్తున్నారంటే..

Chain Snatcher: అతనొక్కడే.. కొట్టేసిన స్కూటీ‌పై దర్జాగా బయలుదేరాడు. నెత్తిపై క్యాప్, బ్లాక్ మాస్క్, జాకెట్, షూస్ ఇలా అన్నింటిని ఎవరూ గుర్తుపట్టకుండా

Hyderabad: కొట్టెసిన స్కూటీతో దర్జాగా దొంగతనాలు చేసి చెక్కేశాడు.. మరి పోలీసులు ఏం చేస్తున్నారంటే..
Chain Snatcher
Shaik Madar Saheb
|

Updated on: Jan 22, 2022 | 8:59 AM

Share

Chain Snatcher: అతనొక్కడే.. కొట్టేసిన స్కూటీ‌పై దర్జాగా బయలుదేరాడు. నెత్తిపై క్యాప్, బ్లాక్ మాస్క్, జాకెట్, షూస్ ఇలా అన్నింటిని ఎవరూ గుర్తుపట్టకుండా ధరించాడు. కేవలం ఆరు గంటలల్లో హైదరాబాద్‌లో వరుసగా దొంగతనాలు చేశాడు. చివరకు ఓ హోటల్ వద్ద స్కూటీని వదిలి.. పోలీసులకే సవాల్ చేసేలా వెళ్లాడు ఆ దొంగ.. ఇప్పుడు ఆ చైన్ స్నాచర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటన భాగ్యనగరంలో ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ వరుస దొంగతనాలు అంతరాష్ట్ర దొంగ పనేనని పోలీసులు నిర్దారణకు వచ్చారు.

ఈ నెల 19న ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు నగర & శివారు ప్రాంతాల్లో వరుసగా గొలుసుల చోరీలు జరిగాయి. వరుసగా పలుచోట్ల ఐదుగురు మహిళల నుంచి గొలుసులను లాక్కెళ్లిన దొంగ చివరగా రాచకొండ మేడిపల్లి సంపూర్ణ హోటల్ సమీపంలో స్కూటి ని వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. వెస్ట్ జోన్ లోని ఆసిఫ్ నగర్లో స్కూటీ దొంగతనం చేసిన నేరగాడు.. ఆ తర్వాత వరుసగా గొలుసుల దొంగతనం చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

అనంతరం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చోరీలు చేసిన లింక్ సీసీ ఫుటేజ్‌ను అయా జిల్లాల పోలీసులకు పంపినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. స్కూటీని ఆ ప్రాంతంలో వదిలి మేడిపల్లిలో బస్సులో వరంగల్ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనరెట్ పోలీసులను ట్రై పోలీస్ కమిషనరెట్ దర్యాప్తు అధికారులు అలెర్ట్ చేశారు. అయితే.. చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగ పనేనని పోలీసులు గుర్తించారు.

మొత్తం 200 మంది పోలీసులతో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన దొంగలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read:

Hyderabad: బంజారాహిల్స్ లో దారుణం.. లిఫ్ట్ లో ఇరుక్కుని మహిళ మృతి..

US-Canada Border: సరిహద్దు దాటుతూ భారతీయ కుటుంబం బలి.. శిశువు సహా..