Covid Survey : జీహెచ్ఎంసీ పరిధిలో జోరుగా సాగుతోన్న జ్వర పీడితుల ఇంటింటి సర్వే.. ఇవాళ ఒక్కరోజే 1, 96, 794 ఇళ్లలో ఆరా
GHMC fever survey : కొవిడ్ నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ లకు చెందిన 1669 బృందాలు నేడు 196794 ఇళ్లలో సర్వే నిర్వహించాయి...
GHMC fever survey : కొవిడ్ నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ లకు చెందిన 1669 బృందాలు నేడు 196794 ఇళ్లలో సర్వే నిర్వహించాయి. ఇవాళ బుధవారం ఒక ఏ.ఎం.ఎం, ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ తో కూడిన బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరం ఉన్నవారి వివరాలను సేకరించి, జ్వరం ఉన్న వారికి ఉచిత మెడికల్ కిట్ లను అందచేశారు. జ్వర కేసులు నమోదయిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటి లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 13 83 654 ఇళ్లలో సర్వే నిర్వహించారు. నగరంలో ప్రతీ బస్తి దావాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావాఖానాలలో అవుట్ పేషంట్ కు జ్వర పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇవాళ అన్ని ఆసుపత్రుల్లో 17,105 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 2, 53 ,015 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫోన్ కాల్స్ కు ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించారు.