AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చార్మినార్ నీడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు.. అడ్డోస్తే దాడులు.. పోలీసన్నలు జర చూడండి..

హైదరాబాద్‌లో గంజాయి వినియోగం పెరిగిపోతోంది. ముఖ్యంగా పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రమవుతోంది. ఈ ప్రాంతాలలో గంజాయి బ్యాచ్‌లు విచ్చలవిడిగా తిరుగుతూ అరాచకం సృష్టిస్తున్నారు. గంజా తాగి.. స్థానిక ప్రజలతో పాటు వ్యాపారులను బెదిరిస్తూ.. అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ రెచ్చిపోతున్నారు.

Hyderabad: చార్మినార్ నీడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు.. అడ్డోస్తే దాడులు.. పోలీసన్నలు జర చూడండి..
Charminar Drug Gangs
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 02, 2025 | 7:02 PM

Share

హైదరాబాద్‌లో గంజాయి వినియోగం పెరిగిపోతోంది. ముఖ్యంగా పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రమవుతోంది. ఈ ప్రాంతాలలో గంజాయి బ్యాచ్‌లు విచ్చలవిడిగా తిరుగుతూ అరాచకం సృష్టిస్తున్నారు. స్థానిక ప్రజలతో పాటు వ్యాపారులను బెదిరిస్తూ.. అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ.. రెచ్చిపోతున్నారు. ఈ బ్యాచ్‌లు తమకు మామూలు డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేయడం, పదేపదే బెదిరించడం, రోజూ వచ్చి వసూళ్లకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో గంజాయి వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఫుట్‌పాత్ వ్యాపారులు, తోపుడు బండ్ల చిరు వ్యాపారులు.. ఈ గంజాయి బ్యాచ్‌ల ఆగడాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

రోజంతా కష్టపడి అమ్మితే వచ్చేది అంతంతమాత్రమే అని, దాన్ని కూడా గంజాయి బ్యాచ్‌ బెదిరించి లాక్కుంటున్నారని వ్యాపారులు వాపోతున్నారు. పోలీసులు స్పందించి రక్షించాలని కోరుతున్నారు. చార్మినార్ ప్రాంతం ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ఈ గంజాయి బ్యాచ్‌ల వేధింపులకు గురవుతున్నారు. వారి ఎదుటే రోడ్లపై గంజాయి బ్యాచ్‌లు రౌడీలుగా ప్రవర్తించడంతోపాటు.. పలు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని.. వసూళ్ల కోసం గుంపులుగా కూర్చుంటున్నారు. దీంతో పర్యాటకులు భయంతో అక్కడ నిలబడలేకపోతున్నారు.

వీడియో చూడండి..

ఇలాంటి వారితో చార్మినార్ పర్యాటక రంగం కూడా దెబ్బతింటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు పర్యాటకులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా చిరు వ్యాపారులకు కూడా నష్టం తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గంజాయి వినియోగాన్ని అరికట్టడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..