AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీఛీ ఇదేం కక్కుర్తి.. ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే వామ్టింగ్ చేసుకోవాల్సిందే..

హైదరాబాద్‎లో ఫేమస్ రెస్టారెంట్ రాయలసీమ రుచుల‎పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. భారీగా కల్తీ పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. మైదా పిండి‎పై పురుగులు భారీగా ఉండటాన్ని చూసి 20 కేజీల మైదా పిండిని అధికారులు సీజ్ చేశారు. పక్కనే ఉన్న పెద్ద డబ్బాను తెరిచి చూశారు. అందులో ఉన్న రెండు కేజీల చింతపండుపై పురుగులు పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో రెండు కేజీల చింతపండును సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఛీఛీ ఇదేం కక్కుర్తి.. ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే వామ్టింగ్ చేసుకోవాల్సిందే..
Hyderabad
Vijay Saatha
| Edited By: |

Updated on: May 20, 2024 | 5:16 PM

Share

హైదరాబాద్‎లో ఫేమస్ రెస్టారెంట్ రాయలసీమ రుచుల‎పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. భారీగా కల్తీ పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. మైదా పిండి‎పై పురుగులు భారీగా ఉండటాన్ని చూసి 20 కేజీల మైదా పిండిని అధికారులు సీజ్ చేశారు. పక్కనే ఉన్న పెద్ద డబ్బాను తెరిచి చూశారు. అందులో ఉన్న రెండు కేజీల చింతపండుపై పురుగులు పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో రెండు కేజీల చింతపండును సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఫ్రిజర్‎లో ఉన్న పాల ప్యాకెట్లను పరిశీలించారు. వీటిపై డేట్ ఎక్సపెయిరీ అయినట్టు గుర్తించారు.

షా గౌస్ రెస్టారెంట్‎లోను భారీగా కల్తీ ఆహారం..

హైదరాబాద్‎లోని షాగౌస్ బిర్యాని‎కి మంచి డిమాండ్ ఉంది. అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. వీటిలోను నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను ఫీజ్‎లో స్టోర్ చేసి ఉండటాన్ని గుర్తించారు. షా గౌస్ హోటల్‎లోని రికార్డ్స్‎ని సైతం అధికారులు పరిశీలించారు. వీటిలోనూ నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించినట్టు అధికారుల తనిఖీల్లో బయటపడింది. పరిశుభ్రతతో పాటు నీటి శుభ్రతపైన అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. షా గౌస్ హోటల్లో శాంపుల్స్‎ను సేకరించిన అధికారులు లాబ్స్‎కు పంపించారు. ఈ తనిఖీల్లో 168 గోలీ సోడా బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇది అమ్మడానికి ఎలాంటి అనుమతులు లేవని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇండియన్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్‎పైన ఎలాంటి రేట్లు లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. రూ.11 వేల రూపాయల విలువైన డ్రై ఫ్రూట్స్‎ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశుభ్రతకు సంబంధించిన వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు.

కొద్దిరోజుల క్రితం ఖైరతాబాద్‎లోని కామత్ హోటల్‎పైన తనిఖీలు నిర్వహించిన అధికారులు.. నూడుల్స్‎తో పాటు టీ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేకుండానే ఫుడ్ హ్యాండ్లర్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పక్కనే ఉన్న సుఖ్ సాగర్‎లో సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఎలాంటి లేబుల్ లేకుండా పుట్టగొడుగులు అమ్ముతున్నట్టు గుర్తించారు. స్పాట్‎లోనే వాటిని బయటపడేశారు. ఇలా హైదరాబాద్ లోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో మెరుపుదాడులు నిర్వహించి పలు ఆహార పదార్ధాలను సీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..