AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అరేయ్.. ఏంట్రా ఇలా తయారయ్యారు.. లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. ‘చుడీదార్ గ్యాంగ్’ హల్చల్

హైదరాబాద్ నగరంలో.. మొన్నటివరకు దొంగలు, చైన్ స్నాచర్లు, చెడ్డి గ్యాంగ్ లతో భయపడిపోయిన ప్రజలు.. తాజాగా చుడీదార్ గ్యాంగ్‌తో హడలెత్తిపోతున్నారు. ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. వారిద్దరిలో ఒకరు చూడీదార్, మరొకరు బుర్కా ధరించి మహిళల గెటప్ లో ఇంట్లోకి ప్రవేశించారు.

Hyderabad: అరేయ్.. ఏంట్రా ఇలా తయారయ్యారు.. లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. ‘చుడీదార్ గ్యాంగ్’ హల్చల్
Hyderabad Crime News
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: May 20, 2024 | 4:45 PM

Share

హైదరాబాద్ నగరంలో.. మొన్నటివరకు దొంగలు, చైన్ స్నాచర్లు, చెడ్డి గ్యాంగ్ లతో భయపడిపోయిన ప్రజలు.. తాజాగా చుడీదార్ గ్యాంగ్‌తో హడలెత్తిపోతున్నారు. ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. వారిద్దరిలో ఒకరు చూడీదార్, మరొకరు బుర్కా ధరించి మహిళల గెటప్ లో ఇంట్లోకి ప్రవేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు ఈనెల 16న హైదరాబాద్ నుంచి ఒంగోలు కి వెళ్లారు. తాను తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోనే వస్తువులు మొత్తం చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంటికి వేసిన తాళం కూడా పగలగొట్టి ఉండటంతో దొంగలు పడ్డారని అనుమానించిన వెంకటేశ్వరరావు.. ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.. కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు.

సిసిటివి ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. దుండగులు లేడీస్ గెటప్ లో అపార్ట్మెంట్ లోపలికి ప్రవేశించినట్లు నిర్ధారించారు. ఇద్దరు వ్యక్తులు కూడా మహిళ గెటప్ లో వెంకటేశ్వరావు ఇంటి లోపలికి వెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇద్దరు వ్యక్తులే చోరికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇద్దరి కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో వీరే దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వరావు ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికీ వీరితో తీసుకొచ్చిన పరికరాలతో తాళాన్ని సైతం పగలగొట్టి లోపలికి వెళ్ళినట్టు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల్లో సైతం ఇద్దరూ ఒక కవర్ ని పట్టుకొని వెళుతున్నట్టు కనిపించింది.

వీడియో చూడండి..

వెంకటేశ్వరరావు ఇంట్లో నాలుగు తులాల బంగారంతో పాటు ఒక లక్ష రూపాయలు నగదు, ఒక లాప్టాప్ ని సైతం దుండగులు అపహరించారని ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు. అయితే చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులు మహిళలా లేదా పురుషులా..? లేక పురుషులే.. చుడిదార్ ధరించి ఈ తరహాలో చోరీలకు పాల్పడుతున్నారా..? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. మొన్నటి వరకు కేవలం చెడ్డీ గ్యాంగ్ కేసులే చూశామని.. ఇప్పుడు తాజాగా చూడిదార్ గ్యాంగ్ తెరపైకి రావడంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..