BJP vs TRS: హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వార్.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు

తెలంగాణ రాజకీయాల్లో ఫ్లెక్సీ వార్‌ తారస్థాయికి చేరింది. సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ మొదలుపెట్టిన పొలిటికల్‌ ఫైట్‌కు.. టీఆర్ఎస్‌ తనదైన స్టయిల్‌లో కౌంటర్‌ ఇస్తోంది.

BJP vs TRS: హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వార్.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
Pm Modi Flexi in Hyderabad
Follow us
Janardhan Veluru

|

Updated on: Jun 29, 2022 | 4:21 PM

తెలంగాణ రాజకీయాల్లో ఫ్లెక్సీ వార్‌ తారస్థాయికి చేరింది. సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ మొదలుపెట్టిన పొలిటికల్‌ ఫైట్‌కు.. టీఆర్ఎస్‌ తనదైన స్టయిల్‌లో కౌంటర్‌ ఇస్తోంది. హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ సభ జరగనున్న నేపథ్యంలో.. ఆ చుట్టుపక్కల మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ అందులో రాశారు. BYE BYE Modi అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ‌లు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో పోలీసులను మోహరించారు. బిజేపీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఫ్లెక్సీలను తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బేగంపేట పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. క్రేన్ తెప్పించి ఆ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. అటు మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల  బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.

హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు..

ఇవి కూడా చదవండి

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ఫోటోలతో ఫ్లెక్సీలు, కాషాయ జెండాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. జులై 2, 3 తేదీల్లో హైటెక్స్ వేదికగా బీజేపీ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు.

అటు జులై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభకు భారీ జన సమీకరణపై ఆ పార్టీ నేతలు దృష్టిసారించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 5 వేల మందికి పైగా జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబందించిన బాధ్యతలను పార్టీ జిల్లా అధ్యక్షులకు అప్పగించారు.

బీజేపీ ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ జరిమానా..

హైదరాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వాటిని ఏర్పాటు చేసినందుకు జీహెచ్ఎంసీ జరిమానా విధిస్తోంది. బీజేపీ నేతలు తమ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్‌ కౌంట్‌డౌన్‌పై కూడా జీహెచ్ఎంసీ యాక్షన్ తీసుకుంది. రూ.55వేలు జరిమానా విధించారు.

బీజేపీ జాతీయ నేతల్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు ఇక్కడితోనే ఆగిపోలేదు. కమలం నేతలు బస చేసే హోటళ్లన్నిటి సమీపంలో గులాబీ ఫ్లెక్సీలు.. సైన్ బోర్డులే దర్శనమివ్వబోతున్నాయి. పైగా… తెలుగులో కాకుండా నార్త్ వాళ్లకు అర్థమయ్యేలా ఇంగ్లీషక్షరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటవున్నాయి. Bye Bye Modi అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా పెద్దపెద్ద అక్షరాలతో ప్రింట్ చేస్తున్నారు. అటు… జూలై 4 వరకు హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్స్‌ అన్నీ గులాబీ ఫ్లెక్సీల కోసం బుక్ ఐపోయ్యాయి. నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ టీఆర్‌ఎస్‌కే అంటూ యాడ్ ఏజెన్సీలు కూడా చేతులెత్తేశాయి.

తమ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని ప్రమోట్ చేసుకోడానికి కొత్త ప్లాన్లు వెతుక్కుంటోంది బీజేపీ. తమకు ప్లేస్ లేకుండా చేయాలన్న టీఆర్ఎస్ నాయకులవి చీప్‌ ట్రిక్స్‌ అనీ, ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా మోదీ టూర్ సక్సెస్ అవుతుందని ధీమాతో ఉన్నారు కమలనాథులు. తెలంగాణలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ని ఆపడం ఎవ్వరి తరం కాదని బీజేపీ నేత కే. లక్ష్మణ్ ధీమా వ్యక్తంచేశారు.

మోదీ రాజ్యాంగాన్ని అమలు చెయ్యాలని చూస్తే ఎక్కణ్ణించో కాదు.. మా తెలంగాణా నుంచే తిరుగుబాటు మొదలౌతుందని కేటీఆర్ ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఫ్లెక్సీలతో మొదలైన తిరుగుబాటు… మోదీ హైదరాబాద్ వచ్చేసరికి ఏ షేపుల్లోకి మారుతుంది… దీనికి తెలంగాణా కమలం పార్టీ నేతలు ఎటువంటి రిటార్ట్ ఇస్తారు… చూడాల్సిందే మరి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..