TS DOST 2022: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ అడ్మిషన్ల కోసం నేడు దోస్త్ నోటిఫికేషన్.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
TS DOST 2022 Notification: లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ (TS DOST Notification) నేడు (జూన్29) విడుదల కానుంది...
TS DOST 2022 Notification: లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ (TS DOST Notification) నేడు (జూన్29) విడుదల కానుంది. బుధవారం మధ్యాహ్నం 3.30గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.3 లేదా నాలుగు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు.
విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్(https://dost.cgg.gov.in/), టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల విషయానికొస్తే.. ఫస్ట్ ఇయర్ కు మొత్తం 4,64, 892 విద్యార్థులు హాజరైతే 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 63.32 శాతంగా నమోదైంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మొత్తం 67.96 శాతం కాగా వీరిలో అమ్మాయిలు 75.28 శాతంగా ఉండగా, 59.21 శాతం అబ్బాయిలు పాస్ అయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..