BECIL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. పదో తరగతి అర్హతతో 123 కేంద్ర కొలువులు..దరఖాస్తుకు నేడే ఆఖరు!
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), బిలస్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో.. లోయర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్ తదితర పోస్టుల (Lower Division Clerk Posts) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది..
BECIL Lower Division Clerk Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), బిలస్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో.. లోయర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్ తదితర పోస్టుల (Lower Division Clerk Posts) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్ధులకు చివరి అవకాశం.. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 123
పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్, జూనియర్ వార్డెన్, స్టోర్ కీపర్ తదితర పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.18,750ల నుంచి రూ.44,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ.750 ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్‌అభ్యర్ధులకు: రూ.450
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.