Hyderabad: నిత్య పెళ్లి కొడుకు బాగోతం గుట్టు రట్టు.. పాతబస్తీలో అర్ధరాత్రి ఆగిన నాలుగో పెళ్లి..
Hyderabad Old City: అతనికి అంతకుముందు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.. వారందరినీ మోసంచేశాడు. తాను చేసిన ఘనకార్యాలను కప్పిపుచ్చుతూ.. మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనకు రెండో పెళ్లి అంటూ..
Hyderabad Old City: అతనికి అంతకుముందు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.. వారందరినీ మోసంచేశాడు. తాను చేసిన ఘనకార్యాలను కప్పిపుచ్చుతూ.. మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనకు రెండో పెళ్లి అంటూ.. బ్రోకర్ల సాయంతో మరో సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. మరికాసేపట్లో నిఖా జరుగుతుందని అనుకుంటుండగా.. షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రబుద్ధిడికి అంతకుముందే మూడు పెళ్లిళ్లు జరిగాయని తెలియడంతో.. యువతి కుటుంబసభ్యులు నిత్యపెళ్లికొడుకును నిలదీశారు. అర్ధరాత్రి కలకలం రేపిన ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది. పాతబస్తీలో పెళ్లిళ్ల బ్రోకర్లయిన హనీఫ్.. సఫియా ఓ వ్యక్తికి పెళ్లి కుదిర్చారు. హనీఫ్ పెళ్లికొడుకు తరుపున.. సఫియా పెళ్లి కూతురు తరుపున సంబంధం కుదిర్చారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోని నాలుగో పెళ్లికి సిద్ధమైన అతిఖ్.. ఈ విషయాన్ని పెళ్లి కూతురు కుటుంబసభ్యులకు చెప్పలేదు. శుక్రవారం రాత్రి నిఖా జరగాల్సి ఉంది. మరికాసేపట్లో నిఖా జరుగుతుందనగా.. అతిఖ్ వ్యవహారం పెళ్లి కూతురు కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు నిత్య పెళ్లికొడుకును నిలదీశారు. ఇరు వైపులా గొడవ జరిగింది. కాగా.. యువతి కుటుంబ సభ్యులు బ్రోకర్లపై మండిపడ్డారు. డబ్బు కోసం ఇలాంటి పెళ్లిళ్లు చేస్తున్నారంటూ బాధితురాలి కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. నిత్య పెళ్లికొడుకును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాతబస్తీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారిందంటూ పలువురు పేర్కొంటున్నారు.
-నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Also Read: