AP News: తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. పట్టాలపై..
Tirupati Amravati Express: ఏపీలో తిరుపతి - అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా ధర్మవరం పరిధిలోని కదిరి గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Tirupati Amravati Express: ఏపీలో తిరుపతి – అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా ధర్మవరం పరిధిలోని కదిరి గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ట్రైన్ వెళ్తున్న మార్గంలో కొంత మంది గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లు పెట్టారు. అయితే.. పట్టాలపై ఉంచిన రాళ్ల పైనుంచి ట్రైన్ వెళ్లడంతో ఇంజిన్‌లో ఒక్కసారిగా (fire accident) మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్లు వెంటనే రైలును నిలిపివేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో కదిరిగేటు వద్ద అమరావతి ఎక్స్‌ప్రెస్ గంటపాటు నిలిచిపోయింది. ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ట్రైన్‌కు మరో ఇంజిన్ ను జోడించారు. దీంతో రైలు బయలుదేరి వెళ్లింది. కాగా.. అకస్మాత్తుగా రైలు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఈ ఘటనపై రైల్వే అధికారులు అప్రమత్తమై విచారణకు ఆదేశించారు. దీనిపై పోలీసులు కూడా ఆరా తీస్తు్న్నారు. ఇది ఆకతాయిల పనా..? లేక కావాలనే పట్టాలపై రాళ్లు పెట్టరా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
Also Read: