Andhra Pradesh: ఏసీలు, వాషింగ్ మిషన్లు వాడొద్దు.. ప్రజలకు AP SPDCL విజ్ఞప్తి
APలో ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లోనూ ACలు వాడొద్దంటోంది SPDCL. ఫ్యాన్లు మాత్రమే వేసుకోవాలంటోంది. మరోవైపు విద్యుత్ చార్జీల పెంపుపై విపక్షాల నిరసనలు హీట్‌ను ఇంకా పెంచుతున్నాయి.
ఏసీలు వేయొద్దు, వాషింగ్ మిషీన్లు వాడొద్దు. ఫ్యాన్లు మాత్రమే వేసుకోండి, విద్యుత్ వినియోగాన్ని తగ్గించండి. వినియోగదారులకు AP SPDCL చేస్తున్న విజ్ఞప్తి ఇది. సమ్మర్‌లో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగాన్ని తగ్గించాలని కోరుతున్నారు CMD హరినాధ్‌రావు. విద్యుత్ వినియోగం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు.. సాయంత్రం 6 నుంచి 10 వరకు రికార్డు స్థాయిలో నమోదవుతోందని చెప్పారు. ప్రజలు ఏసీలు వాడకుండా సహకరించాలని కోరారు. ఉష్ణోగ్రతలు, విద్యుత్ వినియోగం పెరిగినా కోతలుండవు స్పష్టం చేశారు. విద్యుత్ వాడకంలో ప్రజలు నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో అనధికారిక కోతలు మొదలయ్యాయన్న విమర్శల నేపథ్యంలో SPDCL – CMD ఏం చెప్పారో దిగువ వీడియోలో చూడండి.
మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై మండిపడ్డాయి విపక్షాలు. ఉగాది కానుకగా ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చిందన్నాయి. వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. లాంతర్లు, విసనకర్రలు ప్రదర్శించాయి. ఫ్రిజ్‌లు, కూలర్లు రోడ్డు మీద అమ్మకానికి పెట్టి నిరసన తెలిపారు నేతలు. ప్రజలకు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు పంచిపెట్టారు. జగన్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశాయి BJP,TDP, జనసేన, వామపక్షాలు జగన్ ప్రభుత్వం సామాన్యులపై భారాన్ని మోపిందన్నారు టీడీపీ నాయకుడు బోండా ఉమ.
విపక్షాల విమర్శలకు అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబేనని విమర్శించారు. ఏప్రిల్ ఫస్ట్‌లోనే పవర్ వార్ ఈ రేంజ్‌లో ఉంటే సమ్మర్ పీక్ స్టేజ్‌లో ఇంకెంతగా రాజకీయాన్ని మండిస్తుందో మరి.
AP: పాముకు చేప నైవేద్యం.. మైకంలో కాలనాగుతో ముచ్చట్లు.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో