Buggana Rajendranath: జగన్నాథ గట్టుపై హైకోర్టు నిర్మించి తీరుతాం.. మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
Judicial capital in Kurnool: కర్నూలుకు న్యాయ రాజధాని అందని ద్రాక్షలా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మంత్రి బుగ్గన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల హైకోర్టు తీర్పుతో,
Judicial capital in Kurnool: కర్నూలుకు న్యాయ రాజధాని అందని ద్రాక్షలా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మంత్రి బుగ్గన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల హైకోర్టు తీర్పుతో, రాయలసీమ ప్రజలకు న్యాయ రాజధాని అందని ద్రాక్షలాగా మారింది అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు వాసులకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath) భరోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, కర్నూలు జగన్నాథ గట్టుపై హైకోర్టును నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. హైకోర్టు భరోసాతో పాటు ఆ ప్రాంతంలోని నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుందని బుగ్గన స్పష్టం చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బుగ్గన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
రాష్ట్రంలో మూడు రాజధాలను ఏర్పాటు చేయడంతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ ఎప్పటినుంచో చెబుతోంది. కర్నూలు ప్రాంతం దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైందని, ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజల కష్టాలు తీర్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటుకు ప్లాన్ చేసిందని చెబుతున్నారు వైసీపీ నేతలు. 2019లోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినా, దీనిపై కొందరు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో కర్నూలు న్యాయ రాజధాని ఏర్పాటుకు బ్రేక్ పడింది. మళ్లీ దీనిపై ఆశలు చిగురించేలా కామెంట్స్ చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.
Also Read: