AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Sales: దసరా అంటే అట్లుంటది మరి.. పొట్టు పొట్టుగా తాగేశారు మావ.. రికార్డులన్నీ బద్దలయ్యాయ్..

దసరా సందర్భంగా, తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. నిన్న అక్టోబర్‌ రెండు గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావడంతో, లిక్కర్‌ సేల్స్‌ తగ్గుతాయేమో అనుకున్నారు. అయినా సరే ముందుగానే కొనుక్కుని పెట్టుకున్న మద్యంతో మందుబాబులు దసరా ధమాకా జరుపుకున్నారు. డబుల్‌ కిక్‌ ఇచ్చేలా సాగిన లిక్కర్‌ సేల్స్‌, డ్రై డేనాడు కూడా కిక్‌ ఎక్కించాయి.

Liquor Sales: దసరా అంటే అట్లుంటది మరి.. పొట్టు పొట్టుగా తాగేశారు మావ.. రికార్డులన్నీ బద్దలయ్యాయ్..
Dussehra Liquor Sale
Shaik Madar Saheb
|

Updated on: Oct 03, 2025 | 7:06 PM

Share

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతోపాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. దీని ఎఫెక్ట్ దసరా పండుగపై పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతితోపాటు దసరా పండుగ కూడా వచ్చింది. ఆ రోజు మద్యం షాపుల బంద్ నేపథ్యంలో, ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 1వ తేదీనే వైన్ షాపుల దగ్గర రద్దీ పెరిగింది. వైన్ షాపులు, లిక్కర్ మార్టుల ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో దసరా, గాంధీ జయంతి ఒకేరోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయిని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. దసరా సందర్భంగా ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయో చూద్దాం.

దసరా పండుగ వేళ రూ. 698 కోట్లు లిక్కర్ వ్యాపారం జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ సారి మద్యం విక్రయాలపై నిషేధం విధించినా. అమ్మకాల్లో మాత్రం ఎక్కడా తేడా రాలేదు. సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి.. సెప్టెంబర్ 30న రూ.333 కోట్ల మద్యం సేల్స్‌ జరగగా.. అక్టోబర్‌ 1న రూ.86 కోట్ల మద్యం సేల్స్ అయింది.. రెండు రోజుల్లో రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే, సెప్టెంబర్‌ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి.. ఇక బీరు అమ్మకాలు మాత్రం.. ఏరులై పారింది. 3రోజుల్లో 6.71 లక్షల లిక్కర్ కేసులు, 7.22 లక్షల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.

గత సంవత్సరంతో పోలిస్తే ఏడు శాతంగా పైగా మద్యం సేల్స్ పెరిగాయి.. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ దసరాకి ఏడు శాతంగా మద్యం సేల్స్ పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మద్యం సేల్స్ పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కొంత మేరకు ఊరట నిచ్చింది.

2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో దసరా సందర్భంగా రూ. 3046 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. 2024 సెప్టెంబర్ నెలలో రూ. 2838 కోట్ల అమ్మకాలు జరిగాయి. మొత్తంగా గత సంవత్సరంతో పోలిస్తే సేల్స్ ఏడు శాతం పెరిగినట్లు అంచనాకు వచ్చారు. 2024లో సెప్టెంబర్ నెలలో 28.81 లక్షల కేసులు ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 2025లో 29.92 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 2024 లో 39.71 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగగా 2025 36.46 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.

ఈ సంవత్సరం.. సెప్టెంబర్ 29న రూ.278 కోట్లు. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు. అక్టోబర్ 1న రూ.86.23 కోట్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ మూడు రోజుల అమ్మకాలపై 60 నుంచి 80 శాతం గా పెరిగాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!