Hyderabad: శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా వ్యక్తి.. ఆపి తనిఖీ చేయగా
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో DRI అధికారులు కువైట్ నుంచి షార్జా మార్గం ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1.8 కిలోల బంగారం (7 కడ్డీలు, విలువ రూ.2.37 కోట్లు) స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో DRI అధికారులు పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి షార్జా మార్గం ద్వారా హైదరాబాద్ చేరిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసినప్పుడు 7 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. సీజ్ చేసిన బంగారం 1.8 కిలోల బరువు కలిగి ఉందని, దాని మార్కెట్ విలువ రూపాయిలలో 2.37 కోట్లు ఉంటుందని DRI అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ కొనసాగిస్తున్నారు. విమానాశ్రయాల్లో అక్రమ బంగారం రవాణా ప్రయత్నాలను అరికట్టడానికి క్రమం తప్పకుండా తనిఖీలు జరుపుతున్నట్లు DRI అధికారులు తెలిపారు.
బంగారం .. ఇంతింతై.. ఆకాశమంతై.. చుక్కలను తాకుతోంది ధర. ప్రస్తుతం లక్షా 30 వేలకు చేరింది. ప్రస్తుతం లక్షా 30 వేలకు కాస్త అటు ఇటుగా కొనసాగుతోంది. దీంతో చోరీలు, చైన్ స్నాచింగ్‌లతో పాటు ఇలా బంగారం అక్రమ రవాణా కేసులు కూడా పెరిగిపోతున్నాయి.




