భాగ్యనగరంలో ‘జార్ఖండ్’ రాజకీయం.. ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మెనూలు ఏంటో తెలుసా.?
జార్ఖండ్ రాజకీయం అటూ.. ఇటూ.. తిరిగి హైదరాబాద్ చేరుకుంది. సోమవారం బలనిరూపణ ఉన్న నేపథ్యంలో జెఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. ఇప్పటికే బీజేపీ.. జేఎంఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బహిరంగ స్టేట్‌మెంట్‌లు ఇస్తోంది.
జార్ఖండ్ రాజకీయం అటూ.. ఇటూ.. తిరిగి హైదరాబాద్ చేరుకుంది. సోమవారం బలనిరూపణ ఉన్న నేపథ్యంలో జెఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. ఇప్పటికే బీజేపీ.. జేఎంఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బహిరంగ స్టేట్‌మెంట్‌లు ఇస్తోంది. దీంతో అధికార ప్రభుత్వ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం వారిని హైదరాబాద్ తరలించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలకు.. శామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌లో వసతి ఏర్పాటు చేశారు. ఆ రిసార్ట్‌లో ఉన్న ఒబిజ్ బ్లాక్‌లో ఉన్న 14 ఫ్లోర్‌లలో ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేశారు.
సోమవారం ఉదయం నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి అక్కడ నుంచి జార్ఖండ్‌లో ల్యాండైన తర్వాత నేరుగా అసెంబ్లీలో బలపరీక్షకి వెళ్తారు. అప్పటివరకు జార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలదే. దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మున్షితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ నేతలు.. వారిని పర్యవేక్షణ చేస్తున్నారు. శామీర్‌పేట్ లియోనియా రిసార్ట్‌లో ఉన్న ఓబిజ్ బ్లాక్ సెక్యూరిటీ కోసం మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. బ్లాక్‌లో ఉన్న 14 ఫ్లోర్లకు ఒక్కొక్క పోలీసు అధికారితో పాటు లిఫ్ట్‌ల వద్ద కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. ఎమ్మెల్యేలకు సర్వ్ చేసే సిబ్బందికి మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేశారు. సర్వ్ చేసే సిబ్బందికి ఫోన్ అనుమతి ఇవ్వలేదు లియోనియా రిసార్ట్ యాజమాన్యం.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రాంచీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చాక.. నైట్ డిన్నర్‌లో హైద్రాబాద్ బిర్యానీ టెస్ట్ చేశారు. బిర్యానీతో పాటు మిగతా నాన్ వెజ్ రెసిపీలు చాలా ఇష్టంగా తిన్నారని సమాచారం. శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ సాంబార్‌తో పాటు దోశను ఎక్కువ ఎమ్మెల్యేలు తీసుకున్నారని తెలుస్తోంది. ఆదివారం కూడా హైదరాబాద్‌లోనే ఎమ్మెల్యేలు ఉంటారు. తెలంగాణ స్పెషల్ రుచులు మరిన్ని టేస్ట్ చేసేందుకు ఆర్డర్లు వస్తున్నాయని లియోనియా రిసార్ట్ సిబ్బంది అంటున్నారు.