‘యూట్యూబ్ వీడియోలకు లైకులు కొట్టారో.. అంతే సంగతులు..’ ఖాతా ఖాళీ అయినట్టే..
తనకు కూడా సైబర్ క్రిమినల్స్ నుంచి కాల్స్ వచ్చాయన్నారు డీజీపీ రవి గుప్తా. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్స్ కొడితే డబ్బులు పంపిస్తామని కాల్స్ చేశారన్నారు. సైబర్ క్రిమినల్స్ నుంచి ప్రతీ ఒక్కరు కాల్స్, మెసేజ్‌ల నుంచి అలర్ట్‌గా ఉండాలన్నారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీతో లాభాలకన్నా.. నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు డీజీపీ.
తనకు కూడా సైబర్ క్రిమినల్స్ నుంచి కాల్స్ వచ్చాయన్నారు డీజీపీ రవి గుప్తా. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్స్ కొడితే డబ్బులు పంపిస్తామని కాల్స్ చేశారన్నారు. సైబర్ క్రిమినల్స్ నుంచి ప్రతీ ఒక్కరు కాల్స్, మెసేజ్‌ల నుంచి అలర్ట్‌గా ఉండాలన్నారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీతో లాభాలకన్నా.. నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు డీజీపీ.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ వర్క్‌షాప్ నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ వర్క్ షాప్‌కి డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రీసెంట్ టైమ్స్‌లో జరుగుతున్న సైబర్ క్రైమ్స్.. వాటి నుంచి ఎలా అలర్ట్‌గా ఉండాలోనన్న అంశాలపై వర్క్‌షాప్ జరిగింది.
సైబర్ క్రిమినల్స్ నుంచి తప్పించుకోవడానికి తాను రెండు బ్యాంక్ అకౌంట్స్ మెయింటెన్ చేస్తున్నానన్నారు డీజీపీ. ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే మెయిన్ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్‌కి డబ్బులు పంపి.. ఆ అకౌంట్ నుంచి ఆన్లైన్ పేమెంట్ చేస్తానన్నారు. తనకు కూడా సైబర్ క్రిమినల్స్ నుంచి కాల్స్ వచ్చాయని.. యూట్యూబ్‌లో వీడియోస్‌కి లైక్స్ కొడితే డబ్బులు వస్తాయని ఆశ చూపారన్నారు. మొబైల్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇచ్చే పర్మిషన్స్ పట్ల అలర్ట్‌గా ఉండాలన్నారు డీజీపీ. చదువుకున్న వాళ్లే సైబర్ క్రైమ్స్ బారిలో పడుతున్నారని తెలిపారు. కర్ణాటక డీజీపీ కూడా సైబర్ క్రైమ్ వలలో పడ్డారని తెలిపారు.
హైదరాబాద్ కమీషనరేట్‌లో రోజుకి ఇరవై సైబర్ క్రైమ్ కంప్లయింట్స్ వస్తున్నాయన్నారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. మొబైల్‌లో సెక్యూరిటీ ఫీచర్స్ ప్రతీ ఒక్కరూ తెలుసుకుని అలర్ట్‌గా ఉండాలన్నారు. అవేర్నెస్ వల్ల 60 శాతం సైబర్ క్రైమ్ కేసులను నివారించే అవకాశాలు ఉంటాయన్నారు. సైబర్ క్రైమ్‌లో ఫైనాన్షియల్‌గా మోసపోయిన కొందరు జీవితకాలం కోలుకోలేకపోతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 870 కానిస్టేబుల్స్‌కి సైబర్ క్రైమ్‌పై ట్రెయినింగ్ ఇస్తున్నామన్నారు సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్. భవిష్యత్‌లో ఫిజికల్ క్రైమ్ కన్నా సైబర్ సెక్యూరిటీ క్రైమ్ కేసులే ఎక్కువగా ఉంటాయన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడ్డవారెవరైనా 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి కంప్లయింట్ చేయాలని సూచించారు. మోసపోయామని గ్రహించి.. తొందరగా కంప్లయింట్ చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇప్పటివరకు 130 కోట్ల మనీని హోల్డ్‌లో పెట్టామన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడ్డవారి నుంచి ప్రతీరోజు 1930 కాల్ సెంటర్‌కి రెండు వేలకు పైగా కాల్స్ వస్తున్నాయన్నారు సైబర్ సెక్యూరిటీ సెల్ అధికారులు.