Viral: అందరిలో భర్త చెంప చెళ్లుమనిపించిన భార్య..ఏం జరిగిందంటే.! వీడియో.
హైదరాబాద్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది అంటే స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి సైతం సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో స్టాల్స్ ఏర్పాటు చేసి అందరికీ అవసరమైన అన్ని రకాల వస్తులువు విక్రయిస్తారు. ఈ ఏడాది కూడా నుమాయిష్‌కు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. అయితే ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో కొందరు ఎవరి గోల వారిది అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు.
హైదరాబాద్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది అంటే స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి సైతం సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో స్టాల్స్ ఏర్పాటు చేసి అందరికీ అవసరమైన అన్ని రకాల వస్తులువు విక్రయిస్తారు. ఈ ఏడాది కూడా నుమాయిష్‌కు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. అయితే ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో కొందరు ఎవరి గోల వారిది అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సమయంలో కొందరు తాము ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటారు. ఇంత రద్దీలో తమనెవరు పట్టించుకుంటారులే అన్నట్టు వ్యవహరిస్తారు. అలా ఓ వ్యక్తి చేసిన పనికి పదిమందిలో భార్యచేతిలో చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి రద్దీగా ఉండడంతో మహిళలను అసభ్యంగా తాకుతూ ఆనందం అనుభవించసాగాడు. ఎంత రద్దీగా ఉన్నా నిఘా కళ్లు ఉంటాయన్న విషయం మర్చిపోయాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఈ ఘటనను మొత్తం రహస్యంగా రికార్డు చేశారు. ఆపై అతడిని అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడి భార్యకు సమాచారం అందించి పిలిపించారు. అతడు చేసిన నిర్వాకాన్ని వివరించడంతోపాటు రికార్డు చేసిన వీడియోను ఆమెకు చూపించారు. అంతే, అది చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందు భర్త చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

