తెలంగాణ కేబినెట్ భేటీ.. రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై కీలక చర్చ..!
Telangana Cabinet Meeting: ప్రచారంలో మార్పు నినాదాన్ని హోరెత్తించిన కాంగ్రెస్.. పరిపాలనలోనే ఆ మార్క్ చాటేలా దూకుడు పెంచింది. ప్రజలకు ఇచ్చిన హామీలను గ్యారెంటీగా అమలు చేసి తీరుతామంటోంది. అంతేకాదు ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. అయితే, ఈసారి అయితే ఈసారి పూర్తి బడ్జెట్ కాకుండా.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.

Telangana Cabinet Meeting: ప్రచారంలో మార్పు నినాదాన్ని హోరెత్తించిన కాంగ్రెస్.. పరిపాలనలోనే ఆ మార్క్ చాటేలా దూకుడు పెంచింది. ప్రజలకు ఇచ్చిన హామీలను గ్యారెంటీగా అమలు చేసి తీరుతామంటోంది. అంతేకాదు ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. అయితే, ఈసారి అయితే ఈసారి పూర్తి బడ్జెట్ కాకుండా.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా MCHRDలో అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ ఆన్ అకౌంట్లో ఎలాంటి అంశాలు ఉండాలి అనేదానిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే కేబినెట్ భేటీలోనూ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల తేదీల అంశం కూడా చర్చకు రానుంది. ప్రస్తుతం వున్న సమాచారం మేరకు ఈ నెల 8న తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం- చర్చ.. 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం. ఆ తరువాత 12 నుంచి 5 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
బడ్జెట్ సమావేశాలు సహా ఆరు గ్యారెంటీల అమలు పై కేబినెట్‌భేటీలో ప్రదానంగా చర్చించనున్నారు. మహిళలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామంటూ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐతే విపక్షాల విమర్శలతో మ్యాటర్ వివాదంగా మారింది.
ఎవరేమన్నా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామంటోంది రేవంత్ సర్కార్. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో రూ.500 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే .ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బేరీజు వేసుకుని పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేలా కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
