Hyderabad: 3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. ఇంటికి తాళం.. యజమాని వచ్చి లాక్ పగలగొట్టి లోనికి వెళ్లగా..
ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి.. 3 నెలలుగా అద్దె కట్టడం లేదు. ఇంటి యజమాని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. సరే.. సొంతూరిలో ఏదైనా పని ఉంటే వెళ్లారేమో అని కొన్నాళ్లు పట్టించుకోలేదు. చివరికి ఇంటి వద్దకు వచ్చి లాక్ పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా..

హైదరాబాద్ నేరేడ్‌మెట్ జేకే కాలనీలో భయానక ఘటన చోటుచేసుకుంది. నెలలుగా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని శవం బయటపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం ప్రకారం, ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న వ్యక్తి గత మూడు నెలలుగా కనిపించకపోవడంతో పాటు అద్దె కూడా చెల్లించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని తాళం విరగదీసి లోపలికి వెళ్లాడు. ఇంటి లోపలికి వెళ్లిన యజమానికి కిచెన్‌లో షాకింగ్ దృశ్యం ఎదురైంది. బండ కింద పూర్తిగా డీకంపోజ్ అయిన మృతదేహం కనిపించడంతో అతను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. శవం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న వెంటనే నేరేడ్‌మెట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహం ఎవరిది? ఎలా మరణించారు? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. హత్యా? సహజ మృతినా? అనే అనుమానాలపై విచారణ కొనసాగుతోంది. జేకే కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
Also Read: సావిత్రి చివరి రోజుల్లో కోమాలో అచేతనంగా ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క తెలుగు నటి ఎవరంటే..
