AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG EAPCET 2026: ఈసారి ఈఏపీసెట్‌కు భారీగా పెరిగిన దరఖాస్తులు.. మొత్తం ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026కు దరఖాస్తు గడువు ఆలస్య రుసుముతో మే 2వ తేదీతో ముగియనుది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అందిప దరఖాస్తుల ప్రకారం ఎప్‌సెట్‌ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి ఈసారి దరఖాస్తులు భారీగా పెరిగాయి. గత ఏడాది దాదాపు 87 వేల మంది దరఖాస్తు చేయగా..

TG EAPCET 2026: ఈసారి ఈఏపీసెట్‌కు భారీగా పెరిగిన దరఖాస్తులు.. మొత్తం ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?
Telangana EAMCET Registrations
Srilakshmi C
|

Updated on: Apr 17, 2026 | 4:45 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 17: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న తెలంగాణ ఈఏపీసెట్‌ 2026కు దరఖాస్తు గడువు ఆలస్య రుసుముతో మే 2వ తేదీతో ముగియనుది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అందిప దరఖాస్తుల ప్రకారం ఎప్‌సెట్‌ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి ఈసారి దరఖాస్తులు భారీగా పెరిగాయి. గత ఏడాది దాదాపు 87 వేల మంది దరఖాస్తు చేయగా.. ఈసారి రూ.2,500 ఆలస్య రుసుం ప్రారంభమైన తొలిరోజు అంటే ఏప్రిల్‌ 16 నాటికి ఏకంగా 90,279 మంది దరఖాస్తు చేసినట్లు కన్వీనర్‌ ప్రొపెషర్‌ కె విజయకుమార్‌రెడ్డి తెలిపారు.

అటు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లోనూ భారీగానే దరఖాస్తులు అందాయి. 2.20 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు ఏప్రిల్ 20 వరకు అవకాశం ఉంది. ఇక రూ.5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 2, 2026వ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో ముగింపు తేదీలోగా మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆలస్య రుసుములేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీతో గడువు ముగిసింది. ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీఈ, బీటెక్‌, అగ్రి, ఫార్మ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర వివరాలు ఈ కింది షెడ్యూల్‌లో చెక్‌ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు..

  • రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2026.
  • రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 24, 2026.
  • రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 2, 2026 వరకు
  • దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్‌ 6 నుంచి 8 వరకు.
  • టీజీ ఈఏపీసెట్‌ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ తేదీ: ఏప్రిల్ 23, 2026.
  • టీజీ ఈఏపీసెట్‌ 2026 ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ తేదీ: ఏప్రిల్ 27, 2026.
  • టీజీ ఈఏపీసెట్‌ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: మే 4, 5 తేదీల్లో
  • టీజీ ఈఏపీసెట్‌ 2026 ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: మే 9 నుంచి మే 11 వరకు.

కాగా ఏపీలో ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్ 16తో ముగిశాయి. గురువారం సాయంత్రం 5 గంటల నాటికి మొత్తం 3,00,462 దరఖాస్తులు అందినట్లు ఈఏపీసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ (E)లో 2,09,868 మంది, అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్‌లో 90,279 మంది, రెండు విభాగాలకు (E & AP) సంబంధించి 315 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us