AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి! అసలు ముచ్చట ఏమంటే..

ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజులు, అదనపు ఛార్జీలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరంలో పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రామంతాపూర్‌లోని Hyderabad పబ్లిక్ స్కూల్, హెచ్‌పీఎస్ పాఠశాలల ముందు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. గత నాలుగేళ్లలో ఫీజులు..

Hyderabad: ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి! అసలు ముచ్చట ఏమంటే..
Private Schools Fee Hiked In Hyderabad
Srilakshmi C
|

Updated on: Apr 17, 2026 | 9:21 PM

Share

హైదరాబాద్, ఏప్రిల్ 17: నగరంలోని ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజులు, అదనపు ఛార్జీలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరంలో పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రామంతాపూర్‌లోని Hyderabad పబ్లిక్ స్కూల్, హెచ్‌పీఎస్ పాఠశాలల ముందు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. గత నాలుగేళ్లలో ఫీజులు సుమారు 141% పెరిగినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఫీజులను ఐదు సంవత్సరాల పాటు పెంచకుండా ఫ్రీజ్ చేయాలని, లిఖితపూర్వక హామీ వచ్చే వరకు ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించబోమని ప్రకటించారు.

అదనంగా, పాఠశాలలో పారదర్శకత లేకపోవడం, విద్యా ప్రమాణాలు తగ్గడం, పీటీఏ ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తాయని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us