Matrimony Fraud: మ్యాట్రిమోని మోసం.. యూస్ లో ఫార్మాసిస్టు అన్నాడు ఏకంగా 10 లక్షలు దోచేశాడు..
Matrimony Fraud : మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. ఆన్‌లైన్ అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో దానినే
Matrimony Fraud: మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. ఆన్‌లైన్ అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో దానినే అస్త్రంగా మార్చుకుంటూ కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చదువుకున్న విద్యావంతులు కూడా మోసపోతుండడం గమనార్హం. ముఖ్యంగా మాట్రీమోని పేరుతో ఇటీవల చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా అబ్బాయిలు మోసపోయే సంఘటనలు చూశాం. కానీ తాజాగా ఓ యువతి మ్యాట్రిమోని సైట్‌లో మోసపోయింది. హైదరాబాద్‌లోని తెలుగు మాట్రిమోనియల్ లో యువతిని పరిచయం చేసుకున్న నైజీరియన్ ఆమె దగ్గరి నుంచి 10 లక్షల రూపాయలు దండుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బేగంపేటకు చెందిన ఓ యువతి ఇటీవల తెలుగు మ్యాట్రిమోనీ లో తన ప్రొఫైల్ ని అప్డేట్ చేసింది. వెంటనే ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ ఆ యువతి ప్రొఫైల్ చూసి స్కెచ్ వేశాడు. మీ ప్రొఫైల్ బాగా నచ్చిందని మాయ మాటలు చెప్పి నమ్మించాడు. తాను యూ.ఎస్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. మీకు గిఫ్ట్ పంపంచానని చెప్పి మెల్లగా ఓ కథ అల్లాడు. అనంతరం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులమని చెప్పి మీకు గిఫ్ట్ రూపంలో కొన్ని డాలర్స్ వచ్చాయని ఆమెను నమ్మించాడు. అయితే అవి చట్ట విరుద్దమని కస్టమ్, పలు చార్జీలు చెల్లించాలని ఆ యువతి దగ్గర నుంచి రూ. 10 లక్షలు దోచేశాడు. విషయం తెలుసుకున్న సదరు యువతి మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి నైజీరియన్ అని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.