Hyderabad: నాంపల్లి కోర్టు.. సంచలన తీర్పు. బాలికపై హత్యాచారం కేసులో హోంగార్డ్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష.

Hyderabad: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. బాలికను హత్యాచారం చేశాడన్న కేసులో ఓ హోంగార్డుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది....

Hyderabad: నాంపల్లి కోర్టు.. సంచలన తీర్పు. బాలికపై హత్యాచారం కేసులో హోంగార్డ్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష.
Nampally Court
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 03, 2021 | 8:27 PM

Hyderabad: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. బాలికను హత్యాచారం చేశాడన్న కేసులో ఓ హోంగార్డుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 ఫిబ్రవరిలో తుకారం గేట్‌లో మైనర్‌ బాలికపై లైంగిక దాడికి దిగాడని హోం గార్డ్‌ మల్లికార్జున్‌పై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లి కార్జున్‌ను పోలీసులు ఫిబ్రవరి 19న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ మొదలి పెట్టిన పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. దీంతో పోలీసులు మెడికల్ రిపోర్ట్ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ వరకు అన్ని ఆధారాలను పక్కగా సేకరించారు. తాజాగా మంగళవారం ఆధారలన్నింటినీ పోలీసులు కోర్టులో సమర్పించారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు సాక్ష్యాలన్నీ ఉండడంతో ఆ అఘాయిత్యానికి ఒడిగట్టింది మల్లికార్జున్‌ అని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిందితుడికి 30 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు బాధితురాలి కుటుంబానికి రూ. 40 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Also Read: PM Kisan Scheme: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు పడేది ఆ రోజే..

Lightening: పిడుగులు పడుతున్నప్పుడు ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

Matrimony Fraud: మ్యాట్రిమోని మోసం.. యూస్‌ లో ఫార్మాసిస్టు అన్నాడు ఏకంగా 10 లక్షలు దోచేశాడు..