AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Scheme: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు పడేది ఆ రోజే..

Pradhan Mantri Kisan Samman Nidhi updated news: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం  డబ్బులను..

PM Kisan Scheme: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు పడేది ఆ రోజే..
Pm Kisan
Sanjay Kasula
|

Updated on: Aug 03, 2021 | 8:03 PM

Share

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం  డబ్బులను రైతుల ఖాతాల్లో డబ్బులు ఏ రోజు… ఏ సమయంలో పడనున్నాయో వెల్లడించారు.  PM కిసాన్ 9 వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణ ఫలించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రైతులందరికీ ఈ శుభవార్త చెప్పారు. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద తదుపరి విడత PM-KISAN నిధులను 2021 ఆగస్టు 9 న ఉదయం 11 గంటలకు ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. 

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరు వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతు ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున జమ చేస్తుంది.

ఏప్రిల్-జూలై మధ్య, మొదటి విడత, ఆగస్టు-నవంబర్ మధ్య రెండవ విడత, డిసెంబర్-మార్చి మధ్య మూడవ విడత నగదును జమ చేస్తుంది. ఈ సారి అర్హత గల 9.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి 9వ విడత కింద రూ.19000 కోట్లకు పైగా ఆగస్టు 9 న ప్రధాని నరేంద్ర మోడీ బటన్ నొక్కి జమ చేస్తారు.

మొత్తం 2 హెక్టార్ల కంటే భూమి తక్కువ రైతులు ఈ వార్షిక సబ్సిడీ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పథకాన్ని 2018 డిసెంబర్‌లో ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం రైతులకు ఏడు విడతలుగా చెల్లించింది.

అయితే, నగదు మన ఖాతాలో పడ్డాయో లేదో అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొందరికి SMS రూపంలో మెసేజ్‌లు కూడా వస్తాయి. ఒకవేల మెసేజ్ రాకపోతే ఈ క్రింది విదంగా చేయండి.

ఇలా చెక్ చేసుకోండి…

1. ముందుగా అధికారిక వెబ్‏సైట్.. www.pmkisan.gov.in ఓపెన్ చేయాలి. 2. హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 3. ఆ తర్వాత బెనిఫిసరి లీస్ట్ పై క్లిక్ చేయాలి. 4. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా/ సబ్ జిల్లా, ఊరు వివరాలను సెలక్ట్ చేసుకోవాలి. 5. అనంతరం రీపోర్ట్ గెట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 6. పేజీపై కనిపించే లభ్దిదారుల జాబితాపై క్లిక్ చేయాలి. 7. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 8. ఆ తర్వాత pmksny హోమ్ పేజీకి తిరిగి వెళ్లాలి. 9. మరోసారి బెనిఫిసరి స్టేటస్ పై క్లిక్చేయాలి. 10. మీ ఆధార్ కార్డు వివరాలు, మొబైల్ నంబర్, అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. 11. గెట్ డేట్ బటన్ పై క్లిక్ చేయాలి. 12. ఆ తర్వాత మీ ఇన్‏స్టాల్‏మెంట్ పేమెంట్ చెక్ చేసుకోవాలి.

ప్రయోజనాలు..

1. పీఎం కిసాన్ యోజన దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. 2. ఈ పథకంలో రైతులకు వారి భూమి ఎంత ఉందో సంబంధం లేకుండానే ఆర్థిక సహాయం అందిస్తుంది. 3. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా.. రైతుల ఖాతాల్లోకి నేరుగా ప్రతి సంవత్సరం రూ. 6 వేలు జమ చేస్తుంది. 4. ఇప్పటి వరకు 8 విడతలు అందించింది. అయితే ఈ డబ్బులు అందుకున్న రైతులు 9వ విడత కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. 5. 8 విడతల డబ్బులు రానివారు నేరుగా పిఎం కిసాన్ ఆన్‌లైన్ పోర్టల్ www-pmkisan-gov-in లేదా మొబైల్ యాప్ ద్వారా వారి స్టేటస్ తనిఖీ చేసుకోవచ్చు. 6. ఆగస్టు 2021లో 9 విడత డబ్బులు రానున్నాయి. మరీ మీ వివరాలు సరిగ్గానే ఉన్నాయో లేదో చెక్ చేసుకోండిలా.

 ఇవి కూడా చదవండి: SI Suspended: మరిపెడ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారుల సీరియస్..

Price is more Than Gold: మీకు ఈ సంగతి తెలుసా.. ఈ పక్షి ఈకలు బంగారం ధర కంటే ఎక్కువ..

PayDay Loan: మీకు శాలరీ రావడం ఆలస్యమవుతోందా.. రూ.లక్ష కావాలా.. కేవలం నెల రోజుల కోసం ఈ బ్యాంక్‌లో పే డే లోన్