AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lightening: పిడుగులు పడుతున్నప్పుడు ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

త్తర భారతదేశంలో ఇటీవల జరిగిన పిడుగుపాటులో 40 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. వీటిలో 22 మరణాలు ఒక్క రాజస్థాన్‌లోని అమేర్‌లోనే సంభవించాయి.

Lightening: పిడుగులు పడుతున్నప్పుడు ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
Lightening
KVD Varma
|

Updated on: Aug 03, 2021 | 7:59 PM

Share

Lightening: ఉత్తర భారతదేశంలో ఇటీవల జరిగిన పిడుగుపాటులో 40 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. వీటిలో 22 మరణాలు ఒక్క రాజస్థాన్‌లోని అమేర్‌లోనే సంభవించాయి. అదేవిధంగా మన తెలుగురాష్ట్రాల్లోనూ పిడుగుపాటు కారణంగా వర్షాకాలంలో మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఈ మరణాలను చాలా వరకు నివారించవచ్చని మీకు తెలుసా? అవును, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మరణం నుండి కాపాడవచ్చు. దీని కోసం, నిపుణులు 30-30 సూత్రాన్ని కూడా సూచించారు. అనేక ముఖ్యమైన సమాచారాన్ని కూడా వారు చెప్పారు. మెరుపు కారణంగా శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది.

30-30 ఫార్ములా అంటే 

మెరుపులు వచ్చినప్పుడు మీరు భవనం నుండి బయట ఉంటే, ఈ ఫార్ములాను తప్పనిసరిగా స్వీకరించాలి. మీరు చేయాల్సిందల్లా, మెరుపు మెరిసిన వెంటనే, ఒకటి నుండి 30 వరకు లెక్కించడం ప్రారంభించండి. కౌంటింగ్ పూర్తయ్యే ముందు, మీరు ఉరుము  శబ్దం  వింటే, మీరు అక్కడ ఉండడం ప్రమాదం.  అక్కడ నుంచి వెంటనే మీరు తప్పించుకోవాల్సిన అవసరం ఉన్నట్టే.

అలాంటి సమయాల్లో ఈ విషయాలను గుర్తుంచుకోండి..

మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, బలమైన పైకప్పు ఉన్న భవనం, వాహనం, కారు లేదా అటువంటి ప్రదేశాల కిందకు చేరుకొంది.  చెట్ల కింద, ముఖ్యంగా  పొడవైన చెట్ల కింద ఎట్టి పరిస్థితిలోనూ ఉండవద్దు. ఎందుకంటే అవి పిడుగులను ఆకర్షించి మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తాయి.

అలాంటి సమయాల్లో, ఎత్తైన టవర్లు, చెట్లు, రైలు పట్టాలు లేదా ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండండి. చుట్టూ ఎక్కడైనా మీరు దాక్కోవడానికి అనువైన స్థలం లేకపోతే, అప్పుడు బహిరంగ మైదానంలో వేచి ఉండండి.

ఎలక్ట్రానిక్ వస్తువులను మొబైల్స్, ట్రాన్స్‌ఫార్మర్‌లు, రేడియోలు, టోస్టర్‌లు, యాంటెనాలు లేదా ఇతర లోహ వస్తువులకు దూరంగా ఉండండి.

నీటికి వీలైనంత దూరంగా ఉండండి. నీరు ఉన్న సమీప ప్రదేశాల నుండి వెంటనే దూరంగా వెళ్లడం మంచిది.

ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న పరిస్థితిలో వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ బయట ఉన్నపుడు ఇలా పిడుగులు పడుతున్నట్టయితే.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వెంటనే చేయాలి.

Also Read: Welwitschia Plant : ముప్పై తరాలైన ఈ మొక్క ఎండిపోదు..! మీరెప్పుడైనా దీనిని చూశారా..?

Tesla Car: తాగి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన టెస్లా ఆటోపైలట్ ఫీచర్.. వీడియో వైరల్