Tesla Car: తాగి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన టెస్లా ఆటోపైలట్ ఫీచర్.. వీడియో వైరల్
Tesla Car : మద్యంమత్తులో వాహనం నడుపుతన్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడింది టెస్లా కారు. వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటూ కేవలం మౌత్ టాక్‌తో ప్రపంచం..
Tesla Car : మద్యంమత్తులో వాహనం నడుపుతన్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడింది టెస్లా కారు. వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటూ కేవలం మౌత్ టాక్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కార్ల పరిశ్రమ ఏదైనా ఉందంటే అది టెస్లా. ప్రపంచ మార్కెట్‌లో అదో సంచలనం. ఇటీవల ఆటోపైలట్ ఫీచర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. టెస్లా కారులో డ్రైవర్ వెనుక సీట్లో కూర్చుంటే కారు ఆటోపైలట్ ఫీచర్ దానంతట అదే రోడ్లపై పరుగులు తీస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే వైరల్‌గా మారాయి. అయితే టెస్లా ఆటోపైలట్ ఫీచర్‌ను వినియోగిస్తున్నప్పుడు తప్పనిసరిగా డ్రైవర్ కూడా సీట్లో ఉండాలని సూచిస్తోంది. ఎందుకంటే వాహనం పట్టుతప్పితే అప్పటికప్పుడు అదుపు చేసేందుకు వీలవుతుందన్న ఉద్ధేశ్యంతో వాహనదారులకు టెస్లా ఈ సూచన చేసింది.
డ్రైవర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిలిచిపోయింది
నార్వేకు చెందిన 24 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో టెస్లా ఎస్ మోడల్ కారుతో రోడ్డుపైకొచ్చాడు. తీరా కొంత దూరం వెళ్లాక ఆ యువకుడు సోయిలేకుండా కారులోనే పడిపోయాడు. దీంతో డ్రైవర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆటోపైలెట్ ఫీచర్ కారును ఉన్నపలంగా రోడ్డు పక్కన నిలిపేసింది. దీంతో ఆ యువకుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కారును పక్కకు నిలిపివేయడమే కాకుండా హజార్డ్ లైట్లను ఆన్ చేసి ఎమర్జెన్సీ సర్వీసుకు సంకేతాలు పంపింది. ఈ మొత్తం దృష్యాన్ని అటుగా వెళ్తున్న వాహనదారుడు రికార్డు చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారిందిప్పుడు.
Tesla owner in Norway suffers unconsciousness while driving, Tesla autopilot detects it, slows, comes to a stop so EMS can help @elonmusk @Tesla ❤️??
— Austin Tesla Club (@AustinTeslaClub) July 31, 2021
Also read: