Viral Video : కుక్కలా అరుస్తున్న పావురం..! వీడియో చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేరు..

Viral Video : పక్షుల కిలకిల రావాలు వింటే మనసు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే పావురం ఎప్పుడైనా కుక్కలా మొరగడం మీరు చూశారా..

Viral Video : కుక్కలా అరుస్తున్న పావురం..! వీడియో చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేరు..
Viral Video
Follow us
uppula Raju

|

Updated on: Aug 03, 2021 | 7:10 PM

Viral Video : పక్షుల కిలకిల రావాలు వింటే మనసు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే పావురం ఎప్పుడైనా కుక్కలా మొరగడం మీరు చూశారా.. ఇది చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఓ పావురం కిలకిలారావాలకు బదులుగా కుక్కలా మొరగడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఈ ఫన్నీ వీడియోలో మీరు బాల్కనీ వెలుపల ఒక పావురం మొదటగా కిలకిలరావాల శబ్దం చేయడం చూస్తారు. తర్వాత ఒక వ్యక్తి వెనుక నుంచి కుక్కలా మొరిగే శబ్దం చేస్తాడు. ఆ శబ్దం వినగానే పావురం కూడా కుక్కలా మొరగడానికి ప్రయత్నిస్తుంది. తరువాత ఆ వ్యక్తి పలుమార్లు కుక్కలా శబ్దం చేస్తాడు. అప్పుడు పావురం కూడా పలుమార్లు అదే శబ్దాన్ని అనుకరిస్తుంది.

ఈ షాకింగ్ వీడియో YouTube లో ViralHog అనే పేజీ నుంచి షేర్ చేశారు. ఈ వీడియో 6 వేలకు పైగా వ్యూస్‌ని సంపాదించింది. దీనితో పాటు పావురం అనుకరించే ఈ కళను చూసి ప్రజలు నవ్వుతున్నారు. చాలా మంది వ్యక్తులు ఈ వీడియోను చూసి పలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే పావురం ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు చాలా ధ్వనులను అనుకరించాయి. కొన్ని రోజుల క్రితం ఒక పావురం నిశ్శబ్దంగా షాప్ నుంచి చిప్స్ ప్యాకెట్‌ను దొంగిలిస్తూ పట్టుబడింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కాకుండా పావురాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి మనుషులను వేధించిన వీడియోలు కూడా ఉన్నాయి.

స్వర్గంలో ‘రంభ’ ఈ అందాల ముద్దుగుమ్మ..! భలే అవకాశం కొట్టేసిన గ్లామర్ బ్యూటీ..

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,546 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. రైతులకు రుణమాఫీ జరగదు.. ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేసిన షర్మిల..